Homeవింతలు-విశేషాలుAlaska Utqiagvik Sun: అక్కడ నిత్యం సూర్యోదయమే.. సూర్యాస్తమయం ఎన్ని రోజుల కంటే..

Alaska Utqiagvik Sun: అక్కడ నిత్యం సూర్యోదయమే.. సూర్యాస్తమయం ఎన్ని రోజుల కంటే..

Alaska Utqiagvik Sun: ఇప్పుడు మనకు ఎండాకాలం. సూర్యుడు ఉదయం 6 గంటలకే ఉదయిస్తున్నాడు. భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం అయిందంటే చాలు చుక్కలు చూపిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం 10 గంటలకే రోడ్లమీద అనధికారికంగా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. దీంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. సూర్యుడు ఎంత తొందరగా అస్తమిస్తే బాగుండు అనుకుంటున్నారు. సూర్యుడు త్వరగా అస్తమిస్తే ఉపశమనం పొందచ్చని భావిస్తున్నారు. మనకు మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఈ స్థాయిలో ఇబ్బంది ఉంటే.. అక్కడి ప్రజలకు నిత్యం సూర్యోదయమే. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అలస్కా ప్రాంతంలోని ఉట్కి యాగ్విక్ ప్రాంతంలో సూర్యుడు ఉదయిస్తాడు. 84 రోజులపాటు సూర్యుడికి అస్తమయం అనేది తెలియదు.. ఈ ప్రాంతంలో మే 10న తెల్లవారుజామున రెండు గంటల 57 నిమిషాలకు సూర్యోదయం అయ్యింది. ఇప్పటికి అక్కడ సూర్యాస్తమయం కాలేదు. ఆగస్టు రెండున సూర్యుడు విశ్రాంతి తీసుకుంటాడని.. ఆ రోజే సూర్యాస్తమయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని సైంటిఫిక్ భాషలో మిడ్ నైట్ సన్ ఫినామిన అని పిలుస్తుంటారు. ఇక శీతాకాలంలో ఇక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది.

65 రోజులపాటు సూర్యుడు ఇక్కడ ఉదయించడు. అన్ని రోజులు ఇక్కడ చీకటి ఉంటుంది.. ఇలా ఇక్కడ ఏర్పడేందుకు ప్రధాన కారణం ఈ ప్రాంతం ఉత్తర దుర్గం పరిధిలో ఉంటుంది.. నార్వే, గ్రీన్ ల్యాండ్, ఫిన్లాండ్, స్వీడన్ లాంటి ప్రాంతాలలో ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఉట్కి యాగ్విక్ ప్రాంతంలో ఇటువంటి వింతలు సర్వ సాధారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. పర్యాటకులు ఈ వాతావరణాన్ని ఆస్వాదించడానికి వస్తూ ఉంటారు. అయితే సూర్యాస్తమయం కంటే కూడా సూర్యోదయాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఉత్తర దుర్గం పరిధిలో ఉండడం వల్లే ఇటువంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయి.

ఇక్కడ ప్రజలకు ఉపాధి పర్యాటకం ద్వారా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అక్కడక్కడ పంటలు కూడా సాగవుతూ ఉంటాయి. కాకపోతే రైతులు సూర్యోదయం ఆధారంగా పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఆ ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. సూర్యాస్తమయ సమయంలో.. రైతులు విశ్రాంతి తీసుకుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular