https://oktelugu.com/

Mashco Fiero Tribe : అమెజాన్ అడవుల్లో అరుదైన తెగ.. ఈ జాతి వాళ్లు ఎలా ఉంటారు? ఎలాంటి జీవనశైలి అవలంబిస్తారు?

ఈ భూమి ఊపిరితిత్తులుగా అమెజాన్ అడవులకు పేరు ఉంది. కొన్ని దేశాలలో ఈ అమెజాన్ అడవి విస్తరించి ఉంది. అయితే ఆ అడవిలో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ నివసిస్తోంది. వారి తెగను మాష్కో ఫైరో జాతి అని పిలుస్తారట. వారు ఆహారం కోసం బయటికి వచ్చినప్పుడు.. కెమెరాలకు చిక్కారు.. ఆ వీడియోను సర్వైవల్ ఇంటర్నేషనల్ అడ్వకసి గ్రూప్ విడుదల చేసింది. ఈ జాతి వారికి బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అమెజాన్ అడవుల్లో వీరు నివసిస్తారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 19, 2024 / 12:50 PM IST
    Follow us on

    Mashco Piro Tribe: చుట్టూ దట్టమైన కొండలు.. కనుచూపుమేర వృక్షాలు.. గలాగలా పారే నదులు. ఉవ్వెత్తున దూసుకు వచ్చే సెలయేళ్లు.. ఆ అడవుల్లో పాముల నుంచి సింహాల వరకు జంతువులు.. మనిషి మనుగడ ఉండదు.. నవీన సమాజం జాడ కనిపించదు. అలాంటి చోట వారు నివసిస్తున్నారు.. అమెజాన్ అడవిని నమ్ముకొని బతుకుతున్నారు. ఆ అడవిలో దొరికే పండ్లను తింటున్నారు. ప్రవహించే నీటిని తాగుతున్నారు. చెట్ల సందుల్లో, గుహల చాటుల్లో తలదాచుకుంటున్నారు. ఇన్నాళ్లు అమెజాన్ అడవికి సంబంధించి అనేక పరిశోధకులు పరిశోధనలు చేసినా వీరి జాడ కనిపించలేదు. వారి గురించి నవీన ప్రపంచానికి తెలియలేదు. ఇంతకీ వారు ఎవరంటే..

    అమెజాన్ అడవుల్లో.

    ఈ భూమి ఊపిరితిత్తులుగా అమెజాన్ అడవులకు పేరు ఉంది. కొన్ని దేశాలలో ఈ అమెజాన్ అడవి విస్తరించి ఉంది. అయితే ఆ అడవిలో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ నివసిస్తోంది. వారి తెగను మాష్కో ఫైరో జాతి అని పిలుస్తారట. వారు ఆహారం కోసం బయటికి వచ్చినప్పుడు.. కెమెరాలకు చిక్కారు.. ఆ వీడియోను సర్వైవల్ ఇంటర్నేషనల్ అడ్వకసి గ్రూప్ విడుదల చేసింది. ఈ జాతి వారికి బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అమెజాన్ అడవుల్లో వీరు నివసిస్తారు. పెరూవియన్ పరిధిలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవిలో వీరు జీవిస్తున్నారు.. పెరు సమీపంలోని లాస్ పిడ్రాస్ నదికి సమీపంలో వారు సంచరిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఈ ప్రాంతంలో మాష్కో ఫైరో లు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరు కూడా వారి ఆనవాళ్లను కనుగొన్న దాఖలాలు లేవు. అయితే సర్వైవల్ ఇంటర్నేషనల్ అడ్వకసి గ్రూప్ వారు లాస్ట్ నదిలో సంచరిస్తున్న దృశ్యాలను చిత్రీకరించింది.. మాష్కో పైరో లు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని చెప్పడానికి ఇది సాక్ష్యం అని పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రైడో వర్గాస్ పియో ప్రకటించారు. “ఇంటర్నెట్ రాగానే రిమోట్ అమెజాన్ తెగ యువకులు పో** కు బానిసలయ్యారు. దీంతో ఆతగా పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించింది. మారుమూల గ్రామాలైన మాంటే సాల్వాడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ వాళ్ళు ఆహారం కోసం అన్వేషిస్తున్నారు. అందువల్ల మా కెమెరాకు చిక్కారు. అయితే ఈ తెగ వాళ్ళు ఒకవేళ బయటకి వస్తే, స్థానికులకు, వారికి మధ్య పోరాటాలు జరిగే ప్రమాదం ఉందని” పియో ఆందోళన వ్యక్తం చేశారు.

    ఎలా ఉంటారంటే

    మాష్కో తెగ వారు చూడ్డానికి మనుషుల్లాగే ఉంటారు. నలుపు వర్ణంలో ఉంటారు. పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. మాంసాన్ని కాల్చి భుజిస్తారు. ఆదిమ తెగకు చెందిన వీరు.. విచ్చలవిడి శృంగారాన్ని జరుపుతుంటారు. జంతువులను మచ్చిక చేసుకుంటారు. అడవి దున్నలపై అడవుల్లో తిరుగుతుంటారు. దుప్పి, కణుజు, జింక, మనుబోతుల మాంసాన్ని ఎక్కువగా తింటారు. వేటను ఇష్టపడుతుంటారు.. చేపలను కూడా ఇష్టంగా తింటారు. గుహల్లో జీవిస్తుంటారు. వర్షాలు వచ్చినప్పుడు కొండ ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. నాగరిక జీవనాన్ని అస్సలు ఇష్టపడరు. అయితే వీరి గురించి మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని పియో చెబుతున్నారు. నాగరిక జీవనాన్ని అలవాటు చేస్తే భవిష్యత్తు కాలంలో పెను ప్రమాదాలు సంభవించి, వీరి జాతికి ముప్పు సంభవించే ప్రమాదం పొంచి ఉందని పియో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.