Narasimhudu Movie: ఎన్టీఆర్ తో మూవీ తీసిన నిర్మాత హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ పరిణామం టాలీవుడ్ ని ఊపేసింది. ఆ వివాదం ఏమిటో చూద్దాం. ఎన్టీఆర్ అనతికాలంలో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. వివి వినాయక్ తెరకెక్కించిన ఫ్యాక్షన్ డ్రామా ఆది బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.
ఆది మూవీతో ఎన్టీఆర్ మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక సింహాద్రి ఎన్టీఆర్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. దీంతో నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఎగబడ్డారు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. సింహాద్రి మూవీని దృష్టిలో పెట్టుకున్న ప్రేక్షకులకు ఎన్టీఆర్ అనంతరం చేసిన ఓ మోస్తరు చిత్రాలు నచ్చేవి కావు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ దర్శకుడు బీ గోపాల్ తో చేతులు కలిపాడు. నరసింహుడు టైటిల్ తో మూవీ చేశారు. ఈ చిత్రానికి చెంగల వెంకట్రావు నిర్మాత. ఈయన ఎవరో కాదు.. సమర సింహారెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. బి గోపాల్ తో చెంగల వెంకట్రావుకి నరసింహుడు రెండో చిత్రం. రివేంజ్ డ్రామాగా బి గోపాల్ తెరకెక్కించారు. విడుదలకు ముందే 200 కేంద్రాల్లో 100 రోజులు అని పోస్టర్ వదిలాడు నిర్మాత.
మే 20న సమ్మర్ కానుకగా వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్. హీరోకి ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ ఉండవు. అనుకున్న బడ్జెట్ కంటే భారీగా వెచ్చించి నిర్మించారు. బి గోపాల్ డైరెక్షన్ మీద అంత నమ్మకం ఉండేది. ఆయన ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. నరసింహుడు డిజాస్టర్ కావడంతో నిర్మాత చెంగల వెంకట్రావు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దానికి తోడు ఉత్తరాంధ్రలో నరసింహుడు విడుదలకు సమస్యలు ఏర్పడ్డాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. ఉత్తరాంధ్రలో విడుదల అడ్డుకున్నారు.
ఒత్తిడి గురైన చెంగల వెంకట్రావు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు ఆయన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. చెంగల వెంకట్రావు అప్పుడు పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం విశేషం. నరసింహుడు వివాదంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి చొరవ తీసుకోలేదని చెంగల వెంకట్రావు అన్నారు. అయితే చంద్రబాబుతో ఎలాంటి విబేధాలు లేవు. కానీ పాయకరావుపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించాడు.
ఎన్టీఆర్ వయసులో చిన్నోడు. దాంతో ఆయన నరసింహుడు వివాదంలో తలదూర్చలేదు. నిర్మాతను ఏ విధంగా ఆదుకునేందుకు ముందుకు రాలేదని సమాచారం. అయితే ఈ పరిణామం ఎన్టీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఆతనతో మూవీ తీసిన ఓ నిర్మాత హుస్సేన్ సాగర్ లో దూకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో ఎన్టీఆర్ కి తలనొప్పిగా మారింది.
2007లో రాజమౌళి యమదొంగ తీసే వరకు ఎన్టీఆర్ ని పరాజయాలు వెంటాడాయి. ఒక దశలో ఎన్టీఆర్ భారీగా బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యాడు. రాఖీ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అసలు అభిమానులు కూడా డైజెస్ట్ చేసుకోలేరు. రాజమౌళి సూచనతో ఎన్టీఆర్ బరువు తగ్గాడు. స్లిమ్ గా తయారయ్యాడు. ఎన్టీఆర్ సర్జరీకి పాల్పడినట్లు పుకార్లు ఉన్నాయి. కొందరేమో సహజంగానే తగ్గాడని అంటారు. కంత్రీ చిత్రంలో ఎన్టీఆర్ సన్నగా పుల్లలా ఉంటాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు..