MG Motors: ఎంజీ మోటార్స్ నుంచి 5 కొత్త అదిరిపోయే కార్లు.. త్వరలో వివరాలు బయటకు..

ఎంజీ మోటార్స్ భారత్ లో ప్రారంభించే వాటిలో ‘క్లౌడ్ EV’ గురించి బయటపెట్టారు. దీనిని ఇండోనేషినయా ఇంటర్నేషనల్ ఆటో షో లో ప్రదర్శించారు. క్లౌడ్ ఈవీ 50.6 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 460 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. అయితే దీనిని భారత్ రోడ్లపై పరీక్షించాల్సిన అసవరం ఉంది. ఆ తరువాత భారత్ లో లాంచ్ చేస్తారు. ఎంజీ మోటార్స్ భారత్ లో రిలీజ్ చేసే 5 మోడల్స్ లో ఇది ఒకటిగా నిలవనుంది.

Written By: Chai Muchhata, Updated On : July 19, 2024 12:44 pm

MG Cars

Follow us on

MG Cars: కార్లు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచాయి. భారత మార్కెట్ల వివిధ కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులతో ఆకర్షించాయి. వీటిలో MG Motors ఒకటి. ఎంజీ మోటార్స్ బ్రిటన్ కంపెనీ అయినప్పటికీ ఇండియాలో ఈ కంపెనీ కార్లు ఆదరిస్తున్నాయి. ప్రస్తుతం భారత దేశంలో ఎంజీ మోటార్స్ 51 శాతం వాటాను కలిగి ఉంది. JSW గ్రూపులో ఉన్న ఎంజీ మోటార్స్ రెండు సంస్థలు కలిపి రూ.5 వేల కోట్ల పెట్టుబడిని కలిగి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎంజీ మోటార్స్ నుంచి ఇప్పటి వరకు ప్రీమియం బ్రాండ్లు రిలీజ్ అయ్యాయి. అయితే త్వరలో మరో 5 బ్రాండ్లను భారత్ లో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

MG Motors, JSW సీఈవో ఎమెరిటస్ ఇటీవల కొత్త కార్ల గురించి వివరాలు వెల్లడించారు. భారత్ లో త్వరలో 5 ప్రీమియం బ్రాండ్లను లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవి 2025 నాటికి మార్కెట్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఈ వాహనాలు ఎక్కువ వాతం SUV వేరియంట్లు ఉంటాయి. అలాగే అధునాతన ఫీచర్లను కలిగి ఆకర్షిస్తాయి. ఎంజీ మోటార్స్ వాహనాల్లో ప్రయాణించడం వల్ల కొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంది.. అని ఆయన పేర్కొన్నారు. అయితే వీటిలో కొన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పరిచయం చేయబోతున్నానమని కొత్ల ఏడాదిలో మార్కెట్లోకి వస్తాయని అంటున్నారు.

ఎంజీ మోటార్స్ భారత్ లో ప్రారంభించే వాటిలో ‘క్లౌడ్ EV’ గురించి బయటపెట్టారు. దీనిని ఇండోనేషినయా ఇంటర్నేషనల్ ఆటో షో లో ప్రదర్శించారు. క్లౌడ్ ఈవీ 50.6 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 460 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. అయితే దీనిని భారత్ రోడ్లపై పరీక్షించాల్సిన అసవరం ఉంది. ఆ తరువాత భారత్ లో లాంచ్ చేస్తారు. ఎంజీ మోటార్స్ భారత్ లో రిలీజ్ చేసే 5 మోడల్స్ లో ఇది ఒకటిగా నిలవనుంది.

ఎంజీ మోటార్స్ కు చెందిన వాహనాలు భారత్ లో అత్యధికంగా సేల్స్ అవుతున్నాయి. ఈ కంపెనీ నెలవారీ అమ్మకాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. 2024 జూన్ నాటికి ఈ కంపెనీ మొత్తం ఉత్పత్తుల అమ్మకాల్లో 40 శాతం వాటాను కలిగి ఉంది. వీటిలో JSW MG కి చెందిన ZS Ev అత్యధికంగా సేల్స్ అయినట్లు వెల్లడించారు. అయితే ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో తక్కువ నమోదు చేసినప్పటికీ.. వచ్చే త్రైమాసికం పండుగల సీజన్ అయినందువల్ల మరింత ఎక్కువ వాటా ఉండేలా ప్రయత్నిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే ఇన్వెస్ట్ మెంట్ స్థాయి ఎక్కువగా ఉండడంతో డీలర్లపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. అయితే డీలర్ల ను ఉత్సాహ పరిచేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ప్రస్తుతం భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోతుంది. దాదాపు చాలా కంపెనీలు ఈవీల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎంజీ మోటార్స్ నుంచి ఎస్ యూవీ వేరియంట్ లో 5 మోడళ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగదారులను ఇంప్రెస్ చేస్తామని అంటున్నారు. అయితే ఇప్పటికే వివిధ కంపెనీల మధ్య ఈవీల కోసం పోటీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఏంజీ మోటార్స్ ఏకంగా 5 మోడళ్లను తీసుకురానుండడంతో ఆటోమోబైల్ రంగం వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. కాగా ఈ 5 మోడళ్ల గురించి త్వరలోనే వివరాలు బయటపెడుతామని అంటున్నారు.