Thanjavur: “లక్కు బాగుంటే.. వలలో పడ్డ ఫిష్.. స్టార్ హోటల్లో డిష్ అవుతుందట..” అప్పట్లో ప్రాచుర్యం పొందిన ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఆ జాలరి జీవితంలోనూ నిజమైంది. చేపల కోసం అతడు వల విసిరి.. పైకి లాగి విప్పి చూస్తే.. ట్రెజర్ హంట్ లాగా అతడికి పెద్ద మూట కనిపించింది. ఆ మూట మామూలుది కాదు.. జాలర్లు చేపల వేట కోసం రోజులకొద్దీ సముద్రంలోనే గడుపుతారు. ఒక్కోసారి వలకు చేపలు చిక్కితే.. ఒక్కోసారి ఖాళీ చేతులతోనే వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది. చేపలు చిక్కిన సందర్భంలో మాత్రం జాలర్లు పండగ చేసుకుంటారు. కొన్నిసార్లు వారికి అరుదైన చేపలు చిక్కుతాయి. ఇక వాటిల్లో కచిడి చేపలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే వాటిల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి.. వాటికి బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ చేపలు కనుక వలకు చిక్కితే మూడు, నాలుగు నెలలు కష్టపడితే వచ్చే ఆదాయం.. ఒక్క రోజులోనే సమకూరుతుంది.
చెన్నైలోనే తంజావూరు జిల్లా అదిరం పట్టినం ప్రాంతానికి రవి వృత్తిరీత్యా మత్స్యకారుడు. ఇటీవల సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలో వల విసిరాడు. వల వేసి బయటికి లాగుతుండగా విపరీతమైన బరువు అనిపించింది. దీంతో రవి ఆనందంతో గంతులు వేశాడు. ఆ వలను బయటికి లాగి చూస్తే 25 కిలోల గోల్డ్ ఫిష్ అలియాస్ కచిడి చేప కనిపించింది. ఇంకేముంది తన దరిద్రం మొత్తం పోయిందని ఆనందపడ్డాడు. గోల్డ్ ఫిష్ శాస్త్రీయ నామం ప్రోటోనిబియా డయాకాంతస్.. దీనిని బ్లాక్ స్పాటెడ్ క్రోకర్ అని కూడా అంటారు. సముద్రం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ చేపను వేలం వేసేందుకు మార్కెట్ కు తీసుకొచ్చాడు రవి.. అరుదైన చేప కావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. వేలంపాట వెయ్యి రూపాయల తో మొదలైంది. వ్యాపారులు పోటాపోటీగా ధర పెట్టడంతో ఏకంగా 1,87,770 పలికింది.. దీంతో రవి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. జాక్ పాట్ లభించిందని సంబరపడ్డాడు.
వాస్తవానికి ఈ చేపలు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా సముద్రతీరా ప్రాంతాలలో కనిపిస్తాయి. తమిళనాడులో మాత్రం అరుదుగా లభిస్తాయి. ఈ చేపల్లో ఔషధ గుణాలు విరివిగా ఉంటాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్ శస్త్ర చికిత్సలో ఉపయోగించే దారాలను తయారు చేసేందుకు ఈ చేపలను ఉపయోగిస్తారు. ఈ చేప రెక్కలను ఖరీదైన వైన్లను శుభ్రం చేస్తారట. ఈ చేప మాంసాన్ని సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారట. ఔషధాల తయారీలోనూ వీటి భాగాలను ఉపయోగిస్తారట.. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఓ జాలరికి ఇదే తీరుగా కచిడి చేప దొరికింది. వేలంలో అది కూడా లక్షల్లోనే ధర పలికింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A rare fish was auctioned in thanjavur for 1 87 lakh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com