Shankar Elephant: మనసున మనసై.. బతుకున బతుకై.. తోడు ఒకరు ఉండిన అదే భాగ్యము.. అదే అందము.. అదే సౌఖ్యము.. వెనకటికి ఓ సినిమాలో సూపర్ హిట్ పాట ఇది. ఒక మనిషి జీవితానికి సంబంధించి.. అందులో ఉన్న అనుబంధాలు.. గాడతల గురించి ఈ పాటలో ప్రధానంగా ప్రస్తావించారు. అతిమంగా ఒక మనిషికి కచ్చితంగా తోడు అంటూ ఉండాలని.. తోడు ఉంటే జీవితం బాగుంటుందని పాటలో ప్రస్తావించారు. అది పాట మాత్రమే కాదు నిజ జీవితం కూడా.
నిజ జీవితంలో కష్టాలను, సుఖాలను, దుఃఖాలను, ఆనందాలను, అనుభూతులను పంచుకోవడానికి ఒక తోడు కచ్చితంగా ఉండాలి. ఒక తోడు ఉంటేనే మనసు తేలిక ఉంటుంది. తనువు హాయిగా ఉంటుంది. మనకంటూ ఒక మనిషి ఉన్నాడు అనిపిస్తుంది. అందువల్లే “బంధాల వల్ల దృఢత్వం ఏర్పడుతుంది. మాటల వల్ల మనిషి జీవితం సుఖవంతం అవుతుందని” పెద్దలు అంటారు. కేవలం మనుషుల విషయంలోనే కాదు జంతువులకు కూడా ఒక తోడు ఉండాలి. తోడు అనేది లేకపోతే జంతువులు కూడా మనోవేదనకు గురవుతాయి. ఆ వేదనలోనే కన్నుమూస్తాయి.
1998 లో దేశానికి రాష్ట్రపతిగా శంకర్ దయాల్ శర్మ ఉండేవారు. ఆరోజుల్లో జింబాబ్వే ప్రభుత్వం రెండు ఆఫ్రికన్ ఏనుగులను ఆయనకు బహుమతిగా ఇచ్చింది. వాటిలో ఒక ఏనుగు కు శంకర్ అని పేరు పెట్టారు. ఆ ఏనుగులను ఢిల్లీలోని జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. దాదాపు 24 సంవత్సరాలపాటు అవి అక్కడ ఉంటున్నాయి. అయితే శంకర్ తో పాటు వచ్చిన మరో ఏనుగు 2001లో అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత శంకర్ ఒంటరిగానే జీవించడం మొదలుపెట్టింది. ఒంటరి జీవితం కావడంతో మనోవేదనకు గురయ్యాయి. పైగా 13 సంవత్సరాల పాటు అది ఏకాంత నిర్బంధంలో ఉంది. తోడు కోసం ఎదురుచూసి చూసి చనిపోయింది. మరో ఏనుగును దానికోసం ప్రవేశపెట్టినప్పటికీ అంత సులభంగా కలవలేకపోయింది. నిత్యం విచారంలో ఉండేది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేకపోయేది. చివరికి ఆ వేదన తట్టుకోలేక ఈనెల 17న చనిపోయింది. శంకర్ చనిపోయిన నేపథ్యంలో జంతు సంరక్షణ కేంద్ర నిర్వాహకులు దాని దేహాన్ని ఖననం చేశారు.