OG Akira Nandan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు కావడం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు పెద్దగా ఆశించిన మేరకు సక్సెసులనైతే తే సాధించడం లేదు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే వచ్చిన ‘హరిహర వీరమల్లు ‘ సినిమాతో ప్రేక్షకుడిని ఏ మాత్రం మెప్పించలేకపోయాడు…ఇక ఇప్పుడు ఈనెల 25వ తేదీన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అఖీరా నందన్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటు గత కొన్ని రోజులుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి అఖిరా నటించిన సీన్ ఏంటి ఆయన ఈ సినిమాలో ఎక్కడ కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ లోనే అఖిరా నందన్ కనిపిస్తారట… పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన శిక్షణ ఇస్తున్న క్రమంలో అక్కడ అఖిరా నందన్ కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇది కనక నిజంగానే జరిగినట్లయితే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక అఖిరా నందన్ సైతం ఇప్పుడు యాక్టింగ్ లో గాని, మార్షల్ ఆర్ట్స్ లో గాని శిక్షణ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందర్లోనే ఉందని సోలో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీగా ఇవ్వబోతున్న నేపథ్యంలోనే ఓజీ సినిమాలో అతన్ని భాగం చేసి ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ అయితే అఖిరా నందన్ ను ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం మరొక నాలుగు రోజులపాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఈరోజు ఓజీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రాబోతోంది. మరి ఆ ట్రైలర్ ని చూస్తే సినిమా మీద అంచనాలు మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…