Japanese Zoo: నిద్ర, ఆకలి అనేవి శరీరానికి ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం.. శృంగారం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. మెదడులో రకరకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి.శరీరం నుంచి వెలుపడే చెమట ద్వారా అనేక వ్యర్ధాలు బయటికి వెళ్లిపోతాయి. తద్వారా శారీరక అలసట ఏర్పడి త్వరగా నిద్ర పడుతుంది. అంతేకాదు శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది.. ఇది కేవలం మనుషులలో మాత్రమే కాదు.. జంతువులకు కూడా అదే అనుభూతి ఇస్తుంది. అందువల్లే జంతువులు శృంగారాన్ని ఇష్టపడుతుంటాయి. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఒక విచిత్రమైన సమస్య ఎదురయింది. ఇంతకీ ఆ సమస్య ఏమిటి.. ఎలా పరిష్కారమైందంటే..
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
మనిషి చేస్తున్న అభివృద్ధి.. దాని తాలూకు విధ్వంసం వల్ల అడవులు మొత్తం నాశనం అవుతున్నాయి. పర్యావరణ మొత్తం ధ్వంసం అవుతున్నది. దీనివల్ల జంతువుల సంఖ్య తగ్గిపోతుంది. మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉంది. అందువల్లే కదా ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న నమీబియా నుంచి చీతాలను మనం దిగుమతి చేసుకున్నాం. మధ్యప్రదేశ్లో అడవిలో వదిలిపెట్టినప్పటికీ అందులో కొన్ని కన్నుమూశాయి. అయితే మనదేశంలో చీతాలు ఎలా అంతరించిపోయాయో.. జపాన్ లో కూడా హైనాలు అలానే అంతరించిపోయాయి. దీంతో వాటి సంఖ్యను పెంచడానికి అక్కడి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. నాలుగు సంవత్సరాల క్రితం రెండు హైనాలను జపాన్ లోని మార్యామా జూలో ప్రవేశపెట్టింది. వీటికోసం బాగానే ఖర్చు పెడుతుంది. గడచిన నాలుగు సంవత్సరాలుగా జూలో రెండు హైనాలను దగ్గరగా ఉంచినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. పిల్లలు కాదు కదా కనీసం ఆ రెండు హైనాలు దగ్గరికి వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదు. నాలుగేళ్లుగా ఎదురు చూసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈ సమస్య ప్రభుత్వం దృష్టి దాకా వెళ్ళింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. హైనా లను అత్యంత జాగ్రత్తగా పరిశీలించారు.. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత తేలింది ఏంటయ్యా అంటే.. ఈ రెండు కూడా మగవే.. మరి ఇన్ని రోజులపాటు మీరు ఏం చేస్తున్నారు.. అంటూ అక్కడి అధికారులు వెటర్నరీ వైద్యులను ప్రశ్నించారు. అయితే మగ, ఆడ హైనా మర్మాయవాలు ఒకే విధంగా ఉంటాయట. వాటిని జాగ్రత్తగా చూస్తే తప్ప అర్థం కాదట. హైనాలను అంత జాగ్రత్తగా పరిశీలించడం కుదరదు. పైగా అవి మనుషులను చూడగానే మీదికి వస్తుంటాయి. తమ పదునైన దంతాలతో చీల్చి చీల్చి చంపేస్తాయి. అందువల్లే భయంతోనే ఆ వెటర్నరీ డాక్టర్లు వాటి దాకా వెళ్ళలేకపోయారు. అన్నట్టు వీటికి ఫెర్టిలిటీ చేయించడం.. ఐవీఎఫ్ చేయించడం అసలు కుదరదు. ఎందుకంటే అవి హైనాలు కాబట్టి.. అత్యంత ప్రమాదకరమైన జంతువులు కాబట్టి.. వీటి గురించి వార్త బయటకు వచ్చిన తర్వాత.. ఒక చర్చ నడుస్తోంది.. ఈమధ్య చాలా విషయాల్లో మగ, ఆడ తెలియడం లేదు. పర్టికులర్ గా రాజకీయాలలో అసలు తెలియడం లేదు. ఆఫ్ట్రాల్ ఈ హైనా లు మాత్రం ఎంత.