Nani Mother: ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి నేడు వంద కోట్ల గ్రాస్ ని అవలీలగా కొల్లగొట్టేంత రేంజ్ కి ఎదిగిన నాని(Natural Star Nani) గురించి ఆయన అభిమానులకు కూడా చాలా విషయాలు తెలిసి ఉండవు. ఇప్పటి వరకు ఆయన అత్యధిక శాతం తన సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూస్ మాత్రమే ఇచ్చాడు కానీ, ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. కానీ మొట్టమొదటిసారి ఆయన జీ తెలుగు లో రీసెంట్ గానే మొదలైన ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) అనే టాక్ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఆయన చెప్పిన కొన్నిటిని విన్న తర్వాత, ఇది నిజమా?, ఇంతకాలం మనకి తెలియదు గా అని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
జగపతి బాబు(Jagapathi Babu) నాని ని ఒక ప్రశ్న అడుగుతూ ‘సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి?’ అని అడుగుతాడు. దానికి నాని సమాధానం చెప్తూ ‘వాళ్ళు పెద్ద సర్ప్రైజ్ కి గురి కాలేదు. చదువు ఎలాగో మనకి అబ్బలేదు, నేను ఈ దారిలోనే నడుస్తానని వాళ్లకు ముందే తెలుసు, కానీ నన్ను చిన్నప్పటి నుండి మా పిన్ని చాలా ప్రోత్సహించేది. మా ఇంట్లో ఎవ్వరూ చూడండి ఆమె నాలో చూసింది. ఇప్పుడు నేను సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక ఆమె ఎంతో సంతోషిస్తుంది. నేను చెప్పాను కదా, ఎదో ఒకరోజు నువ్వు ఈ స్థాయికి వస్తావని, ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అంటుంది. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఆమె ఎలా నన్ను ఇంతలా నమ్మింది అని’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
తన పిన్నమ్మ తనకు సొంత అమ్మతో సమానమని, చిన్నప్పటి నుండి ఆమె దగ్గరే ఎక్కువ పెరిగానని, నా గత చిత్రం హిట్ 3 లో హీరోయిన్ నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తూ, చనిపోయిన మా అమ్మ AI ద్వారా మాట్లాడినట్టుగా చూపిస్తుంది గుర్తుందా?, అందులో కనిపించింది మా పిన్ని గారే అని నాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. దీంతో నాని అమ్మ కూడా ఒక నటి యే అని, ఆమె హిట్ 3 లో నటించింది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేశారు. ఇక నాని సొంత అమ్మ అయితే కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగి గా పనిచేసేది అట. తానూ 15 సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఉద్యోగం చేస్తూనే ఉండదని, చాలా బలవంతంగా ఆమె చేత రిటైర్మెంట్ ఇప్పించానని చెప్పుకొచ్చాడు నాని. ఆయన మాట్లాడిన ఈ పాట్లు బాగా వైరల్ అయ్యాయి.