Female farmer with child: చిన్నపిల్లలు నవ్వుతుంటే అందం. మాట్లాడుతుంటే అందం. నట్టింట్లో అడుగులు వేస్తుంటే అందం. అందువల్లే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటుంటారు. చిన్నపిల్లలు నవ్వుతున్న వీడియోలు.. సందడి చేస్తున్న వీడియోలు.. మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. కానీ పంట చేలో.. వరి నారుమడిలో కనిపించిన దృశ్యాలు అరదు. అయితే అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆ వీడియోలో ఓ చిన్నారి చేస్తున్న సందడి చూడముచ్చటగా ఉంది. ఆ చిన్నారి మాటలు.. ఆటలు ఆ నారు మడికే సందడి తీసుకొచ్చాయి.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు. కాకపోతే ఆ చిన్నారి వరి నారుమడిలో చేసిన సందడి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వరి నారుమడిలో ఓ తల్లి వరి నారు సేకరిస్తోంది. పక్కనే తన చిన్నారిని ఒక పాత్రలో మెత్తటి బట్టలు వేసి పడుకోబెట్టింది. నెలల వయసు ఉన్న ఆ చిన్నారి ఆ పాత్రలో శ్రీకృష్ణుని మాదిరిగా పడుకొని ఉంది. కాళ్లను ఆడిస్తూ.. చేతులను కదిలిస్తూ సందడి చేస్తోంది. అంతేకాదు ఆమె తల్లి మాట్లాడుతుంటే తను కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఆ చిన్నారి మాటలకు ఆ తల్లి మురిసిపోతోంది. తన పాపను చూసి నవ్వుకుంటున్నది. ఇక ఆ పాత్రను అటు ఇటు తిప్పితే అందులో పడుకొని ఉన్న చిన్నారి కూడా ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. వేలాది వీక్షణాలు.. అంతే సంఖ్యలో ఆసక్తులు ఈ వీడియోకు వచ్చాయి. చాలామంది ఆ చిన్నారి తల్లిని అభినందిస్తున్నారు. నెలల వయసున్న చిన్నారిని పొలం దాకా తీసుకొచ్చి ఆమెను ఏడవనివ్వకుండా.. పనికి ఆటకం కలగకుండా చేస్తుండడాన్ని చూసి అభినందిస్తున్నారు. అమ్మ ఉన్నచోట ఆకలి ఉండదు. అమ్మ ప్రేమ ముందు పిల్లలకు ఏడుపు అనేది ఉండదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
నారుమడిలో బిడ్డతో మహిళా రైతు
సీజన్‌తో సంబంధం లేకుండా అన్నదాతలు ఎల్లప్పుడూ పనిచేస్తూ దేశానికి అన్నం పెట్టాల్సిందే. తాజాగా ఓ మహిళా రైతు నిబద్ధత పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో భాగంగా వరినాట్లు వేసేందుకు వచ్చిన ఓ మహిళా రైతు తనతోపాటు పసిబిడ్డను… pic.twitter.com/ghtnjsJWlD
— ChotaNews App (@ChotaNewsApp) September 8, 2025