spot_img
Homeవింతలు-విశేషాలు98 Year Old Inspiring Grandmother Story: ఈ బామ్మకు 98 ఏళ్ల వయసు.. 200...

98 Year Old Inspiring Grandmother Story: ఈ బామ్మకు 98 ఏళ్ల వయసు.. 200 కుటుంబాలకు ఈమెనే ఆధారం.. ఏమిటా కథ.. ఎందుకంత ప్రత్యేకం

98 Year Old Inspiring Grandmother Story: కొందరికి వయసు పెరుగుతున్నా కొద్దీ కొత్త కొత్త వ్యాపకాలు వస్తుంటాయి. వాటిని వారు అమలులో పెడుతుంటారు. తద్వారా కాలక్షేపం ఉండడం మాత్రమే కాదు.. తమకంటూ ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటారు. అందులోనే గొప్పగా బతుకుతుంటారు. తాము బతకడం మాత్రమే కాదు.. పదిమందికి బతుకునిస్తుంటారు. ఇటువంటి వారికి వయసుతో సంబంధం ఉండదు. మిగతా వేటితో కూడా పట్టింపు ఉండదు. వారికి ఉన్నదల్లా కేవలం వ్యాపకం.. పనిచేయాలనే కోరిక మాత్రమే.

నేటి కాలంలో ఇటువంటి వారు అరుదుగా ఉంటున్నారు. అటువంటి వారి విజయ గాధలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి గాథనే ఈమెది కూడా. ఆమె పేరు ప్రభావతి భగవతి. వయసు 98 సంవత్సరాలు. ఇంతటి వయసులో కూడా ఆమె చలాకీగా పని చేస్తున్నారు. పనిచేయడం మాత్రమే కాదు.. 200 పైగా కుటుంబాలకు ఆధారంగా మారారు. ఆ కుటుంబాలకు గుజరాతి, మహారాష్ట్ర వంటకాలను అందిస్తున్నారు. వారి జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్నారు. తద్వారా ఆకలి తీర్చే అన్నపూర్ణగా మారిపోయారు.

ప్రభావతి భగవతి కి 2017లో భర్త వియోగం కలిగింది. అతని జ్ఞాపకాల నుంచి ఆమె కోలుకోలేకపోయారు. పిల్లలు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమెకు ఒంటరితనం ఇబ్బందిగా మారింది. దానిని జయించడానికి ఆమె 2018లో నానీస్ శాస్తా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇతరుల ద్వారా తన వంటకాలను అందరికీ చేరువ చేశారు. దాదాపు 200కు పైగా కుటుంబాలకు ఆమె గుజరాతి, మహారాష్ట్ర వంటకాలను అందిస్తున్నారు. తన వంటకాల ద్వారా చాలా మంది కడుపు నింపుతున్నారు.

ఈమె తన వంటకాలను తయారు చేయడంలో ఎటువంటి కృత్రిమ విధానాలను ఉపయోగించరు. కేవలం ఆర్గానిక్ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేస్తారు. వాటి ద్వారానే వంటలు తయారు చేస్తారు. గుజరాతి వంటలు, మహారాష్ట్ర వంటలు చేయడంలో ఈమె సిద్ధహస్తురాలు. పైగా సంప్రదాయ గుజరాతి వంటకాలలో ఈమెది అం వేసిన చెయ్యి . ఈమె వంటలు అత్యంత రుచికరంగా ఉంటాయి కాబట్టి.. చాలామంది లొట్టలు వేసుకుని తింటారు.

కొంత మందికి వయసు పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరికొందరికి జ్ఞాపక శక్తి ఉండదు. అలాంటివారికి ప్రభావతి జీవితం ఒక స్పూర్తి పాఠం. ఎందుకంటే వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. వయసు పైబడిందని.. వయసు ఏమీ చెయ్యలేమని అనుకుంటే పెద్ద పొరపాటు.. అనుభవం అన్నీ నేర్పిస్తుంది. వ్యాపకం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version