spot_img
Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Advice To Lucknow Players: బెల్లం చుట్టూ ఈగల్లాగా.. విరాట్ చుట్టూ లక్నో...

Virat Kohli Advice To Lucknow Players: బెల్లం చుట్టూ ఈగల్లాగా.. విరాట్ చుట్టూ లక్నో ప్లేయర్లు.. సంజీవ్ గోయంకా చూస్తే ఏమైనా ఉందా

Virat Kohli Advice To Lucknow Players: లక్నో జట్టు ఓడిపోతేనే.. ఆ జట్టు యజమాని సంజీవ్ గోయంక తట్టుకోలేడు. ఏ ఆటగాడు ఆడ లేకపోయినా ఒప్పుకోడు. ఎందుకంటే అతడికి ఓటమి అంటే ఇష్టం ఉండదు. పెట్టుబడి పెట్టాడు కాబట్టి.. దానికి వందింతలు రాబట్టుకోవాలని చూస్తాడు. కెప్టెన్ మీద అరుస్తాడు. ఆటగాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. బహుశా కార్పొరేట్ వ్యక్తులు ఇలానే ఉంటారేమో..

బుధవారం లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు చెప్పుకునే స్థాయిలో పరుగులు చేయలేకపోయింది. దీంతో మైదానంలో సంజీవ్ తీవ్రమైన ఒత్తిడితో కనిపించాడు. ఈ నేపథ్యంలో బౌలింగ్లో కూడా లక్నో జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ (49) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు జట్టు ఈజీగా విక్టరీ సాధించింది.

బెంగళూరు విజయం సాధించిన తర్వాత మైదానంలో మెన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తారు. బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాడు హేజిల్ వుడ్ కు మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అక్కడికి వచ్చాడు. అతడు జట్టు లక్నో ఆటగాళ్లు గుమి గుడారు. అతనితో మాట కలిపారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్లో.. ఫీల్డింగ్ లో విరాట్ కోహ్లీ వారికి సూచనలు ఇచ్చాడు.. అతడు చెప్పిన మాటలను లక్నో ప్లేయర్లు శ్రద్ధగా వింటున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి.

“సాధారణంగా ఏ జట్టు ఆటగాళ్లయినా సరే.. తమ కెప్టెన్ తో మాట్లాడుతుంటారు. అతడు చెప్పే సూచనలు ఆలకిస్తుంటారు. కానీ వీళ్లు తమ కెప్టెన్ ను పక్కనపెట్టారు. ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాడు అయిన విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చారు. అతనితో మాట కలిపారు. అతడు చెప్పిన సూచనలు మొత్తం విన్నారు. విలువైన సలహాలను ఆలకించారు. ఒక ఆటగాడికి ఇంతకు మించిన గౌరవం ఇంకేముంటుంది. విరాట్ కోహ్లీ ఒక సమ్మోహన రూపుడు. అంతకుమించిన పరుగుల యంత్ర గాడు” అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version