Ram Charan latest look 2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) ప్రస్తుతం బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ‘పెద్ది'(Peddi Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘గేమ్ చేంజర్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం గ్లింప్స్ వీడియో సృష్టించిన ప్రభంజనమే. రామ్ చరణ్ ని ఈ యాంగిల్ లో చూస్తామని అభిమానులు కూడా అప్పట్లో ముందుగా ఊహించలేదు. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో వచ్చే సిగ్నేచర్ షాట్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది. ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఈ షాట్ ని రీమేక్ చేస్తూ పలు వీడియోస్ ని అప్లోడ్ చేశారు. అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘పుష్ప’ చిత్రం లో హీరో మ్యానరిజమ్స్ ని సినిమా విడుదల తర్వాత ఇండియా వైడ్ గా అందరూ అనుకరించారు.
Also Read: తండ్రిని మోసం చేసిన కుటుంబ సభ్యులు.. అనసూయ ఆవేదన.. అసలేం జరిగింది?
కానీ ‘పెద్ది’ చిత్రానికి మాత్రం గ్లింప్స్ వీడియో దగ్గర నుండే అందరూ అనుకరించడం మొదలు పెట్టారంటే ఈ సినిమా రాబోయే రోజుల్లో సృష్టించే ప్రభంజనం ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు రకాల గెటప్స్ లో కనిపిస్తాడట. అందుకోసం ఆయన ఒక రేంజ్ లో బాడీ వర్కౌట్స్ చేస్తున్నాడు. కాసేపటి క్రితమే ఆ చిత్ర డైరెక్టర్ బుచ్చి బాబు రామ్ చరణ్ లేటెస్ట్ మేకోవర్ కి సంబంధించిన ఫోటో ని అప్లోడ్ చేయగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ రేంజ్ మేక్ ఓవర్ అవ్వడానికి ప్రధాన కారణం, ఈ సినిమాలో వచ్చే కుస్తీ ఫైట్ సన్నివేశాల కోసం. మొన్నటి గ్లింప్స్ లో హీరో క్రికెట్ ఆడడం చూసి అతను క్రికెటర్ క్యారక్టర్ చేస్తున్నాడు అనుకుంటే పెద్ద పొరపాటే.
Also Read: స్పిరిట్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందా..? ఫ్యాన్స్ కి పండగేనా..?
ఇందులో రామ్ చరణ్ అన్ని రకాల ఆటల్లో నిష్ణాతుడిగా కనిపించబోతున్నాడు. అందులో కుస్తీ కూడా ఒకటి. మారుమూల గ్రామం లో పుట్టిన ఒక కుర్రాడు, తన టాలెంట్ ని లోకం మొత్తం గుర్తించడం కోసం చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతుంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కి సోలో హీరో గా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆయన అభిమానులు చాలా డల్ గా ఉంటున్నారు. వాళ్లకు డబుల్ కిక్ ఇచ్చే విధంగా ‘పెద్ది’ చిత్రం ఉండబోతుంది. డిజాస్టర్ ఫ్లాప్స్ నుండి బయట పడి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకోవడం రామ్ చరణ్ కి కొత్తేమి కాదు. కాబట్టి ఈ సినిమాతో ఆయన కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని మరోసారి బద్దలుకొడుతాడని అభిమానులు బలమైన విశ్వాసం తో ఉన్నారు.
Can’t wait for this Changeover @AlwaysRamCharan Sirrrr❤️@PeddiMovieOffl #peddi pic.twitter.com/BUxlceIBd2
— BuchiBabuSana (@BuchiBabuSana) July 21, 2025