US Citizenship
US Citizenship: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పౌరసత్వాన్ని రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో చాలా మంది అమోమయంలో పడ్డారు. అమెరికాలో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు ఉద్యోగ వీసా, టూరిస్ట్ వీసా ఇలా వెళ్లిన వారే ఎక్కువ. ప్రస్తుతానికి అమెరికాలో దాదాపుగా 54 లక్షల పైగా ఇండియన్స్ ఉంటున్నారు. అమెరికా జనాభా తక్కువే. కానీ ఇక్కడికి వలసదారులుగా వెళ్లిన వారే ఎక్కువ. ఇలా వారిపై వేటు వేయడంతో చాలా మంది ఇండియన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికా పౌరసత్వాన్ని పొందాలంటే చాలా కష్టం. మరి ఇండియన్స్ ఎప్పటి నుంచి అమెరికా పౌరసత్వాన్ని పొందుతున్నారు? అసలు మొదటి పౌరసత్వం తీసుకున్న ఆ వ్యక్తి ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
20వ శతాబ్దం సమయంలో భికాజీ బల్సారా అనే భారతీయుడు మొదటి అమెరికా పౌరసత్వాన్ని పొందాడు. ఇతను ముంబైలో వస్త్ర వ్యాపారి. అక్కడి పౌరసత్వం కోసం ఎంతో పోరాటం చేసి విజయం సాధించాడు. 1900వ సంతవ్సరం ప్రారంభంలో కేవలం శ్వేత జాతీయులకు మాత్రమే అమెరికా పౌరసత్వం ఉండేది. ఈ పౌరసత్వాన్ని పొందాలంటే ప్రజలు తెల్లగా ఉండాలి. అప్పుడే పౌరసత్వం లభించేది. భికాజీ బల్సారీ అమెరికా పౌరసత్వం కోసం ఎంతో శ్రమించాడు. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన తర్వాత భికానీ అమెరికా పౌరసత్వాన్ని పొందాడు. ఈ అమెరికా పౌరసత్వం కోసం భికాజీ కోర్టుకు కూడా ఎక్కాడు. ఆర్యన్ జాతి పౌరులను కూడా తెల్ల జాతీయులగా గుర్తించాలని కోర్టు మెట్లు ఎక్కాడు.
మొదట్లో కోర్టు తన అప్పీల్‌ను తిరస్కరించింది. కానీ ఆ తర్వాత ఆమోదించడంతో కేసు ముందుకు వెళ్లింది. పార్సీ అయిన భికాజీ బల్సారా ముందుగా పర్షియన్ శాఖలో సభ్యునిగా గుర్తింపు పొందాడు. న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కు చెందిన న్యాయమూర్తి ఎమిలే హెన్రీ లాకోంబ్ ద్వారా ఇతనికి అమెరికా పౌరసత్వం వచ్చింది. న్యూయార్క్‌లోని సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ పార్సీలను తెల్ల జాతీయులగా వర్గీకరించింది. ఈ నిర్ణయం యూఎస్ అటార్నీ జనరల్ చార్లెస్ వల్ల భికాజీ బల్సారాకు అనుకూలంగా వచ్చింది. ఇలా అమెరికా పౌరసత్వాన్ని భికాజీ పొందడమే కాకుండా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు. 1917 ఇమ్మిగ్రేషన్ చట్టం తర్వాత అమెరికాకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఐటీ రంగం అభివృద్ధితో భారీ సంఖ్యలో వెళ్లారు.
ఇదిలా ఉండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత అక్రమ వలసదారులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికి దాదాపుగా 7300 మంది చేతులకి సంకేళ్లు వేశారు. వీరిని వారి దేశాలకు పంపకుండా జైళ్లోనే ఉంచి కఠినమైన శిక్షలు విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్రమంగా అమెరికాలో వచ్చిన వలసదారులు అందరికీ కూడా ఇదే గతి పడుతుందని స్పష్టం చేశారు. ఇలా అమెరికాకు వెళ్లిన వలస దారుల్లో ఎక్కువగా బ్రెజిల్‌కు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది.