Japan: అయితే ఆవిష్కరణలు అంత సులభంగా పుట్టవు. అవి వెలుగులోకి రావాలంటే.. మనిషి జీవితాన్ని సార్ధకం చేయాలంటే చాలా మదనం జరగాలి. అనేక రకాలైన వైఫల్యాలను ఎదుర్కోవాలి. ఆ తర్వాతే అవి విజయవంతమవుతాయి. విజయాన్ని సాకారం చేసుకొని సరికొత్త చరిత్రను సృష్టిస్తాయి. ఉదాహరణకి న్యూటన్ గమన నియమాలు వెలుగులోకి రావడానికి చాలా సమయం పట్టింది. కిందపడిన యాపిల్ పండు ఎందుకు పైకి వెళ్లలేదని న్యూటన్ అనుకోకపోతే గ్రావిటీ అనేది ఒకటి ఉందని మనకు తెలిసేది కాదు. కానీ దీనిని కనుక్కోడానికి న్యూటన్ చాలా ప్రయోగాలే చేశాడు. ఇవే కాదు టెలిఫోన్, సైకిల్, విద్యుత్, విమానం, రైలు.. ఇలా మనిషి జీవితాన్ని సమూలంగా మార్చిన ప్రతి ప్రయోగం వెనక శాస్త్రవేత్తల జీవితకాల కష్టం ఉంది. వారు పడిన ఆవేదన కూడా ఉంది. అందువల్లే అవి మనిషి జీవితాన్ని ఇంత సుఖవంతం చేశాయి.
నవీన కాలంలో..
ఇప్పటికాలంలో సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని ఆధారంగానే కొత్త కొత్త ఆవిష్కరణలు పుడుతున్నాయి. ఇక ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేటి కాలంలో మనుషుల అవసరాలు పెరిగిన నేపథ్యంలో.. పాత వస్తువులను కొత్తగా మార్చడం.. కొత్తగా రూపొందించడం వంటివి జరుగుతున్నాయి. వీటి ద్వారా ఒకసారి కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జొమాటో, స్విగ్గి, ఓయో, ఓలా, ఉబర్ వంటివి నవీన కాలంలో సరికొత్త ఆవిష్కరణలుగా చెప్పుకోవచ్చు. అయితే వీటిని ప్రేరణంగా తీసుకొని జపాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి సరికొత్త ఆలోచనకు తెర తీశాడు. జపాన్ దేశంలో పాటుబడిన, శిథిలావస్థలో ఉన్న పిల్లను కవామూరా అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. వాటికి మరమ్మతులు చేసి అద్దెలకు ఇవ్వడం మొదలుపెట్టాడు. దీని ద్వారా అతడు ఇప్పటివరకు 7.7 కోట్లు సంపాదించాడు. అంతేకాదు అపార్ట్మెంట్ భవనాన్ని 9.3 లక్షలకు వేలం వేయగా.. మరో భవనాన్ని అద్దకు ఇవ్వడం ద్వారా 1.87 లక్షలు సంపాదించాడు. అయితే అపార్ట్మెంట్ భవనాన్ని 23.7 లక్షలకు విక్రయించాడు.. అయితే చేసిన పనికి తగినంత ఆదాయం లభించకపోవడంతో కవామురా ఈ పని చేశాడు..” చేసే పనిలో ఆనందం వెతుక్కోవాలి. ఉన్నదానితో సంతృప్తి పడొద్దు. కొత్త దానికోసం అన్వేషించాలి. పరిమితమైన ఆదాయ వనరులతో అపరిమితమైన ఆదాయాన్ని సృష్టించుకోవాలి. దీనికోసం మోసం చేయొద్దు. ఇంకొకరిని అన్యాయం చేయొద్దు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించొద్దు. కేవలం బుర్రను మాత్రమే వాడాలి. అది ఎంత చక్కగా పనిచేస్తే అంత లాభం వస్తుంది. ఆ తర్వాత వెను తిరిగి చూడాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే నా జీవితం నేర్పిన పాఠం అదే. గతంలో సరైన వేతనం లేక.. చేసిన పనికి తగ్గట్టుగా డబ్బులు లభించక చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మాత్రం చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నాను. అపరిమితమైన ఆనందంతో డబ్బులు సంపాదిస్తున్నానని” కవామురా వ్యాఖ్యానించాడు.