America: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక.. అక్కడ భారతీయు పరిస్థితి ఏమంత బాగాలేదు. దీంతో కొందరు జాబ్ మానేసి ఇండియాకు తిరిగి వస్తున్నారు. మరికొందరు జాబ్ తొలగించడంతో ఇండియాకు వస్తున్నారు. దీంతో మానసిక ఒత్తిడిలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. జాబ్ ఎలా.. కుటుంబ పోషణ ఎలా.. జాబ్ వచ్చినా అమెరికాలో ఉన్నంత డబ్బు సంపాదించగలనా అనే టెన్షన్ వెంటారడుతోంది. దీంతో జాలా మంది జాతకాలు చెప్పించుకుని పూజలు చేస్తున్నారు. తమ అదృష్టం ఎలా ఉందో తెలుసుకుంటున్నారు.
తాజాగా అమెరికా నుంచి వచ్చిన రవి అనే తెలుగు వ్యక్తి.. ఓ పత్రిక పంచాంగ కర్తకు లేఖ రాశాడు. తాను అమెరికాలో జాబ్ చేసేవాడినని, తన ఉద్యోగం పోయిందని, గతేడాది ఇండియాకు వచ్చి చిన్న జాబ్ చేస్తున్నానని తెలిపాడు. తన చదువుకు తగిన ఉద్యోగం లేదు. పనికి తగిన వేతనం రావడం లేదు.. జాబ్ ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతున్నాయని తెలిపాడు. తన లైఫ్ ఎప్పుడు మారుతుందని ప్రశ్నించాడు.
పంచాంగకర్త సమాధానం ఇలా..
రవి లేఖకు స్పందించిన పంచాంగ కర్త రవి యొక్క కర్కాటక రాశి (ఆశ్లేష నక్షత్రం, తులా లగ్నం) కీలక గ్రహాలు బుధుడు శుక్రుడు స్వస్థానం కలిగి ఉండటంతో ఇలా జరిగిందని తెలిపాడు. పంచమ స్థానంలో గురుడు–కుజుడు అనుకూల ప్రభావం, దశమ స్థానంలో చంద్రుని స్థానం తదితరాలు మీకు ఉన్నత ఉన్నత ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, వ్యాపార అభివృద్ధి లాంటి వెచ్చని పరిణామాలు ఉంటాయని తెలిపాడు. రెండేళ్లు ఇంతే..
ఇక రవి గురించి వివరిస్తూ.. అన్నీ కలిసి రావడానికి 2027 మే వరకు ఓపికతో ఉండాలని తెలిపారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. శని, రాహు–కేతు ప్రతికూల ప్రభావాలను ఈ సమయం సహించాడు, అయినప్పటికీ ఈ కాల వ్యవధి ముగిసిన తర్వాత కాలం కలిసి వస్తుందని చెప్పార. శివాలయ అభిషేకాలు, గోచార గ్రహ మార్పులు, గురు దక్షిణామూర్తి స్తోత్రం, ఆదిత్య హృదయం పఠనాలు వంటి ఆధ్యాత్మిక చర్యల ద్వారా శాంతి, పసుపు నీడ పొందేందుకు దారి తీస్తాయని వివరించారు. 2027 మే తర్వాత మీకు సుదీర్ఘకాలం (సుమారు 2034 వరకు) మంచి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఉన్నత చదువులు చదివి..
అమెరికాలో ఉద్యోగం చేసినవారు అంటే.. చాలా తెలివైనవారు అని అనుకుంటారు. కష్టపడే తత్వం ఉన్నవారుగా భావిస్తారు. కానీ, ఉద్యోగం పోవడంతో పూర్తిగా దిగజారిపోతున్నారు. ఇందుకు రవి పరిస్థితే ఉదాహరణ. చాలా మంది ఇలా తమ భవిష్యత్ ఏమిటని పూజలు చేస్తున్నారు. దేవుళ్లకు మొక్కులు సమర్పిస్తున్నారు. ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు స్వశక్తితో జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది.. తమ పరిస్థితి ఏమిటని ఆలోచిస్తూ కుంగిపోతున్నారు.