https://oktelugu.com/

Boys wear skirts : ఇక్కడ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్కర్ట్ లు వేసుకుంటారు… కారణమిదీ.. వైరల్ పిక్స్

. 1989లో భూటాన్ ప్రభుత్వం పౌర సేవకులకు GHO తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. భూటాన్‌లో, అధికారిక సందర్భాలలో కూడా పురుషులు దీనిని ధరించాలి.

Written By: , Updated On : January 30, 2025 / 09:48 PM IST
Follow us on

Boys wear skirts  :  అమ్మాయిలు ఏ వస్త్రాలు ధరించినా సరే చాలా అందంగా కనిపిస్తారు. ఇక వారికి నప్పే దుస్తులు వేసుకొని అందంగా ముస్తాబు అవుతుంటారు. కొన్ని డ్రెస్ లు వారి అందాన్ని మరింత పెంచుతాయి. ఇక అమ్మాయిలు లహంగా, సూట్, స్కర్ట్ అంటూ రకరకాల బట్టలను ధరిస్తారు. అయితే అమ్మాయిలకు ఉన్న వెరైటీలు అబ్బాయిలకు ఉండవు అనేది వాస్తవం కదా. పాయింట్ షర్ట్ అంతే కదా. కాస్త ఎక్కువగా అంటే పంచె, కుర్తా అంతే వారి స్పెషల్స్. కానీ అమ్మాయిలకు ఎన్ని వెరైటీలు ఉంటాయి కదా.

ఇక మీలో చాలా మందికి స్కర్ట్ లు వేసుకోవడం ఇష్టం. అయితే ఓ దేశంలో అమ్మాయిల మాదిరి స్కర్టులు వేసుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. భారతదేశంలో అమ్మాయిలు స్కర్టులు ధరించడం కామన్. అయితే అబ్బాయిలు కూడా స్కర్టులు వేసుకునే దేశాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అయితే ఆలస్యం ఎందుకు? మరి ఏ దేశంలో ఇలాంటి వారు ఎక్కువగా ఉన్నారో ఇప్పుడు చూసేద్దాం.

ఈ జాబితాలో మొదటి పేరు గ్రీస్ అంట. అయితే గ్రీకు పురుషులు మోకాళ్ల వరకు స్కర్టులు ధరిస్తారు. ఇక్కడ దీనిని ఫుస్టానెల్లా అంటారు. గ్రీస్‌లోనే కాకుండా మరికొన్ని బాల్కన్ దేశాలలో కూడా ఇలాంటి ఆచారం ఉందని చెబుతుంటారు. ఇక ఈ లిస్ట్ లో జపాన్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ పురుషులు హకామా అనే చీలమండల వరకు సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. జపాన్‌లో, స్కర్ట్ ధరించడం అనేది ఉన్నత వ్యక్తుల గుర్తింపుగా కూడా భావిస్తారట. జపాన్‌లో దాని రాక చరిత్ర గురించి మాట్లాడుతూ, ఇది ఆరవ శతాబ్దంలో చైనీస్ ఇంపీరియల్ కోర్టు నుంచి స్వీకరించారు అని తెలుస్తోంది. వీటిలో చాలా రకాలు ఉన్నాయి.

ఇండోనేషియాలో, సరోంగ్‌ను పురుషులు, మహిళలు ఇద్దరూ ధరిస్తారు. దీనిని యునిసెక్స్ ట్యూబులర్ స్కర్ట్ అని కూడా అంటారు. ఇండోనేషియాలో, సొరోంగ్ ఫాబ్రిక్ ప్రత్యేక పద్ధతిలో కుట్టిన ఈ స్కర్ట్ లకు ఒక గొట్టాన్ని ఏర్పరుస్తారు. వారికి ఇలాంటి డ్రెస్ లు అంటే చాలా ఇష్టమట. ఇదిలా ఉంటే ఈ జాబితాలో భూటాన్‌ కూడా ఉంది. ఇక్కడ ఘో అనేది భూటాన్ పురుషులు ధరించే మోకాళ్ల వరకు ఉండే బెల్ట్ వస్త్రం. దానిని ధరించడం వారికి సాంస్కృతిక గర్వకారణం. 1989లో భూటాన్ ప్రభుత్వం పౌర సేవకులకు GHO తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. భూటాన్‌లో, అధికారిక సందర్భాలలో కూడా పురుషులు దీనిని ధరించాలి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..