https://oktelugu.com/

Niteesha Kandula : అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థిని అదృశ్యం వెనుక ఏం జరిగింది?

క్లీవ్‌లాండ్‌లోని ఓ డ్రగ్‌ ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్‌ చేసి తర్వాత అతని తండ్రికి ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. తర్వాత కిడ్నాపర్‌ చంపేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 03:23 PM IST

    telugu-student-Nitheesha-Kandula

    Follow us on

    Niteesha Kandula : అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హత్యలు, భారతీయులకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, భారతీయ విద్యార్థుల వరుస మిస్సింగులు ఓవైపు కలవరపెడుతుండగానే.. తాజాగా మరో హైదరాబాద్‌ విద్యార్థిని మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని వారం రోజులుగా కనిపించడంలేదు. దీంతో పోలీసులు ఆమెకోసం రంగంలోకి దిగారు. ప్రజల సాయం కోరారు.

    మే 28న మిస్సింగ్‌..
    హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ, శాన్‌ బెర్నార్డినోలో చదువుతోంది. మే 28 నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా ఆమె లాస్‌ ఏంజిల్స్‌లో కనిపించినట్లు యూనివర్సిటీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ కనిపించడం లేదని పేర్కొంది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

    గాలిస్తున్న పోలీసులు..
    యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు కాలిఫోర్నియా పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు. ఆమె చివరిసారి మాట్లాడిన ఫోన్‌కాల్స్, నితీశకు ఉన్న స్నేహితులు, శత్రువుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. మానసిక స్థితి గురించి కూడా యూనివర్సిటీలో ఆరా తీస్తున్నారు.

    నెల క్రితం రూపేశ్‌చంద్ర..
    నెల క్రితం తెలంగాణకు చెందిన రూపేశ్‌చంద్ర చింతకింది షికాగోలో మిస్సింగ్‌ అయ్యాడు. ఇప్పటికీ అతని ఆచూకీని అమెరికా పోలీసులు కనిపెట్టలేదు. ఇక మార్చిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అరాఫత్‌ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత నెల రోజులకు క్లీవ్‌లాండ్‌లోని ఓ సరస్సు వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. క్లీవ్‌లాండ్‌లోని ఓ డ్రగ్‌ ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్‌ చేసి తర్వాత అతని తండ్రికి ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. తర్వాత కిడ్నాపర్‌ చంపేశాడు.