Donald Trump: అఫ్ఘాన్ సంక్షోభం.. మరోసారి బైడెన్ పై మండిపడ్డ ట్రంప్

అఫ్ఘానిస్థాన్ విషయంలో బైడెన్ ప్రభుత్వం నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. అఫ్టాన్ సంక్షోభంపై ఇప్పటికే పలుమార్లు బైడెన్ ను టార్గెట్ చేసిన ఆయన అసలు బైడెన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అఫ్టాన్ లో కనిపిస్తున్న దృశ్యాలు అప్పట్లో వియత్నాంలో కనిపించిన వాటికన్నా ఘోరంగా ఉన్నాయన్నారు. కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని అప్పటి సైగాస్ పతనంతో ట్రంప్ పోల్చారు. అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ఆక్రమించుకుంటున్న సమయంలో బైడెన్ మాత్రం క్యాంప్ డేవిడ్ […]

Written By: Suresh, Updated On : August 18, 2021 12:01 pm
Follow us on

అఫ్ఘానిస్థాన్ విషయంలో బైడెన్ ప్రభుత్వం నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. అఫ్టాన్ సంక్షోభంపై ఇప్పటికే పలుమార్లు బైడెన్ ను టార్గెట్ చేసిన ఆయన అసలు బైడెన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అఫ్టాన్ లో కనిపిస్తున్న దృశ్యాలు అప్పట్లో వియత్నాంలో కనిపించిన వాటికన్నా ఘోరంగా ఉన్నాయన్నారు. కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని అప్పటి సైగాస్ పతనంతో ట్రంప్ పోల్చారు. అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ఆక్రమించుకుంటున్న సమయంలో బైడెన్ మాత్రం క్యాంప్ డేవిడ్ లో కాలయాపన చేశారంటూ ట్రంప్ విమర్శించన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తానేమీ చేయలేదని, ట్రంప్ హయాంలోనే తాలిబన్లతో ఈ ఒప్పందం జరిగిందని బైడెన్ ప్రభుత్వం వాదిస్తోంది.