https://oktelugu.com/

Corona Third Wave in India: థర్డ్ వేవ్ పై కేంద్రం కీలక ఆదేశాలు

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మూడోదశ ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రమాదం నుంచి బయటపడటానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు నిధులు కేటాయించింది. మొత్తం రూ. 456 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం కాగా రాష్ర్ట ప్రభుత్వం 40 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన కార్యక్రమాల కోసం మాత్రమే నిధులను వినియోగించాల్సి ఉంటుంది. కేంద్రం […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 18, 2021 / 11:55 AM IST
    Follow us on

    కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మూడోదశ ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రమాదం నుంచి బయటపడటానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు నిధులు కేటాయించింది. మొత్తం రూ. 456 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం కాగా రాష్ర్ట ప్రభుత్వం 40 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన కార్యక్రమాల కోసం మాత్రమే నిధులను వినియోగించాల్సి ఉంటుంది.

    కేంద్రం రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ర్టంలో ఏయే కార్యక్రమాలు చేపట్టాలో వివరిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. దీంతో రాష్ర్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నీలోఫర్ ఆస్పత్రిని ప్రత్యేక ఆరోగ్య నిలయంగా తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తోంది. నీలోఫర్ తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పించడానికి రూ.270 కోట్లు మంజూరు చేసింది.

    రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో పడకల వసతులు పెంచాలని వీటిలో 20 శాతం కచ్చితంగా పిల్లల కోసం కేటాయించాలని చెప్పింది. కనీసం 27 ఆస్పత్రుల్లో 42 పడకల చొప్పున పీడియాట్రిక్ యూనిట్లను, 6 చోట్ల 32 పడకల చొప్పున పిల్లల వార్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో అన్ని వైద్య శాలల్లో 825, జిల్లా ఆస్పత్రుల్లో 90 ఐసీయూ పడకలను చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని స్పష్టం చేసింది.

    మూడో దశ ఉధృతిలో 1119 పీజీ, మెడికల్ రెసిడెంట్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. మెడికోలను కొవిడ్ విధుల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మానవ వనరుల నియామకాలకు రూ.40 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పింది. 451 ప్రత్యేక అంబులెన్సులు అందుబాటులో ఉంచనుంది. అన్ని ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పేందుకు సంకల్పించింది. కరోనా పరీక్షలు కొవిడ్ ఔషధాలకు రూ.130.48 కోట్టు వెచ్చించింది. 1.10 కోట్ల యాంటీజెన్ కిట్లు, 30.77 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు కొనుగోలు చేయాలని ఆదేశించింది.