Homeఆంధ్రప్రదేశ్‌TANA Support For Farmers: రైతన్నలకు ‘తానా’ చేయూత.. గుడివాడలో రూ.25 లక్షల సాయం

TANA Support For Farmers: రైతన్నలకు ‘తానా’ చేయూత.. గుడివాడలో రూ.25 లక్షల సాయం

TANA Support For Farmers: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్ల పంపిణీ

గుడివాడ రైతులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అండగా నిలిచింది. “రైతు కోసం” కార్యక్రమంలో భాగంగా తానా ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో రైతులకు రూ.25 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

సోమవారం గుడివాడ మార్కెట్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు నాయకత్వం వహించారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో కలిసి స్ప్రేయర్లు, టార్పలిన్లను పరిశీలించి వారికి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, దేశం పట్ల ప్రేమతో ప్రవాసాంధ్రులు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తానా నిదర్శనమని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి వేలాది మంది రైతులకు సహాయం చేస్తున్న కసుకుర్తి రాజా దాతృత్వాన్ని ప్రశంసించారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచామని, కాలువల అభివృద్ధి, డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులతో సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. రైతన్నల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, “రైతు కోసం” కాన్సెప్ట్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో రూ.1.03 కోట్లతో సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రాము కృషితో గుడివాడలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.

TANA Support For Farmers
TANA Support For Farmers

ప్రభుత్వం సబ్సిడీపై అందించే టార్పలిన్లు, ఖరీదైన చార్జింగ్ స్ప్రేయర్లను ఉచితంగా అందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాము, తానా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, టీడీపీ, జనసేన నాయకులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper