spot_img
Homeప్రవాస భారతీయులుTANA Mahasabalu : తానా మహాసభలు... సాహిత్య కార్యక్రమాలు

TANA Mahasabalu : తానా మహాసభలు… సాహిత్య కార్యక్రమాలు

TANA : ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటు చేశారు. సాహిత్య కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేశారు. సాహితీ స్రవంతి పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాలు జూలై 8వ తేదీన, జూలై 9వ తేదీన వైభవంగా జరగనున్నాయి.

శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు జరిగే కార్యక్రమానికి అధ్యక్షులుగా వాసిరెడ్డి నవీన్‌ వ్యవహరిస్తున్నారు. అమెరికాలో తెలుగు కథకులు అంశంపై తాడికొండ శివకుమార శర్మ, డయస్సోరా కథలు అంశంపై సాయి బ్రహ్మానంద్‌ గొర్తి, కవితాపఠనం అంశంపై వసీరా, తమ్మినేని యదుకుల భూషణ్‌ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు మేడసాని మోహన్‌ అవధాన కార్యక్రమం ఉంటుంది.

జూలై 9వ తేదీ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.00 వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిగురుమళ్ళ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించనున్నారు. మనుస్మృతి మంచి చెడు అంశంపై ముత్తేవి రవీంద్రనాథ్‌, తెలుగు నాటకం అంశంపై దీర్ఘాశి విజయ్‌కుమార్‌, పద్యనాటకం అంశంపై మీగడ రామలింగస్వామి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 11.00 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు సంభాషణ పేరుతో ఓ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా జంపాల చౌదరి వ్యవహరిస్తున్నారు. అతిథులుగా తానా గిడుగు రామమూర్తి స్మారక అవార్డు గ్రహీత మన్నెం వెంకట రాయుడు, తానా బహుమతిని గెలుచుకున్న రచయిత చింతకింది శ్రీనివాసరావు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు పాటల అంశంపై కార్యక్రమం జరగనున్నది. కొసరాజు సినిమా పాటలు అంశంపై విజయ చంద్రహాస్‌ మద్దూరి, జానపదం అంశంపై అందెశ్రీ, పేరడీలు అంశంపై జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 వరకు తెలుగు సాహిత్యంలో యువస్వరాలు అంశంపై కార్యక్రమం జరుగుతుంది. వాసిరెడ్డి నవీన్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో బీరం సుందరరావు కవిత్వం అంశంపై, కథలు అంశంపై మల్లిఖార్జున్‌, కవితపఠనం ఏనుగు నరసింహారెడ్డి, కళ్యాణ్‌ మాట్లాడనున్నారు.

https://tanaconference.org

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper
Exit mobile version