Pawan Kalyan OG Premieres: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటాడు. ప్రస్తుతం ఆయన సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా అతని అభిమానుల కోసం ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలను చేయడానికి డేట్స్ ని అడ్జస్ట్ చేసి మరి సినిమాలను పూర్తి చేశాడు… రెండు నెలల క్రితం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ‘ఓజీ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ప్రీమియర్స్ ని చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
ఇక ప్రీమియర్స్ కూడా టిక్కెట్ రేట్లనైతే పెంచారు. తెలంగాణలో అయితే 800 రూపాయలు, ఆంధ్రాలో అయితే 1000 రూపాయలు చొప్పున పెంచినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోల సినిమాలు వచ్చిన కూడా ఓజీ సినిమా ప్రీమియర్స్ తోనే వాళ్ళందరి రికార్డ్ లను బ్రేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇంతకుముందు పుష్ప 2 సినిమాకి ప్రీమియర్స్ అయితే వస్తున్నారు. అయినప్పటికి తెలుగులో ఈ రికార్డును సైతం బ్రేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి ఈ సినిమా ప్రీమియర్స్ కోసం అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు సైతం ఈరోజు నైట్ ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలో మిగతా సినిమాలన్ని రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాయాలని ఇండియాలో ఈ సినిమాకి సూపర్ సక్సెస్ ని సాధించి పవర్ స్టార్ క్రేజ్ మరోసారి తారస్థాయికి వెళ్ళిపోతే చూడాలని అతని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం… చూడాలి మరి రేపు రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తోంది. అలాగే ఈ సినిమా ఎన్ని వందల కోట్ల కలెక్షన్ల ను సంపాదిస్తోంది అనేది…