Homeఅంతర్జాతీయంPM Modi US Visit 2024: అనుసరించే రోజులకు చెల్లు.. ఆదేశించే స్థాయికి ఎదిగాం.. అమెరికా...

PM Modi US Visit 2024: అనుసరించే రోజులకు చెల్లు.. ఆదేశించే స్థాయికి ఎదిగాం.. అమెరికా ప్రసంగంలో మోదీ..!

PM Modi US Visit 2024: అగ్రరాజ్యం అమెరికా పర్యటను వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ.. ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం(సెప్టెంబర్‌ 21 రాత్రి) న్యూయార్క్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో మోదీ మాట్లాడారు. తర్వాత న్యూయర్క్‌లో టాప్‌ కంపెనీల సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాలో భారతీయులు ఎక్కువ. మోదీ ఎప్పుడు అమెరికా వెళ్లినా భారీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఈవెంట్‌కు భారీగా ప్రవాస భారతీయులు తరలివచ్చారు. లాంగ్‌ ఐలాండ్‌ నస్సావూ కోలిజియం స్టేడియం మొత్త ఎన్నారైలతో నిండిపోయింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేవించి మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇండియా అభివృద్ధిని వివరించారు. భారత్‌–అమెరికా సంబంధాలను తెలియజేశారు. ఎన్నారైలను మెచ్చుకన్నారు. మీరే ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్లు అని ప్రశంసించారు. మీ కారణంగానే ఇండియా అమెరికా సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఏఐ అంటే అందరికీ ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ గుర్తుకు వస్తుందని తనకు మాత్రం ఏఐ అంటే అమెరికా ఇండియా గుర్తొస్తాయని తెలిపారు.

అనుసరించే రోజులు పోయాయి..
ఇక భారత్‌ గతంలో అభివృద్ధి చెందిన దేశాలను అనుకరించేదని, ఇప్పుడు ఆ రోజులు పోయాయన్నారు. శాసించే స్థాయికి భారత్‌ ఎదగిందని వెల్లడించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదని, రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నామన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం ఆపేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మెచ్చుకున్నారు. తన సొంత ఊరు డెలావెర్‌లో మోదీకి ఆతిథ్యం ఇచ్చిన బైడెన్‌ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

టాప్‌ సీఈవోలతో భేటీ..
ప్రవాసుల మెగా ఈవెంట్‌ తర్వాత మోదీ న్యూయార్క్‌లో జరిగిన టాప్‌ సీఈవోల రౌంట్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో అమెరికాలోని ప్రముఖ కంపెనీల వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కల్పించే సౌకర్యాలను వివరించారు. ఇక ఆదివారం మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్‌ సమావేశంలో మాట్లాడతారు. ఇందులో 2047 లక్ష్యాలను మోదీ వివరిస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version