https://oktelugu.com/

Ram Pothineni: హీరో రామ్ ని చూసి పారిపోతున్న నిర్మాతలు..ఏ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడో తెలుసా?

'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆయన చేసిన 'రెడ్', 'ది వారియర్','స్కంద', 'డబుల్ ఇస్మార్ట్' వంటీ సినిమాలు ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. సాధారణంగా వరుస ఫ్లాప్స్ వచ్చిన హీరోలు తమ తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ని బాగా తగ్గిస్తారు. కానీ రామ్ మాత్రం రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గేదే లేదు అని అంటున్నాడు. తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడుగుతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 12:44 PM IST

    Ram Pothineni

    Follow us on

    Ram Pothineni: మీడియం రేంజ్ హీరోలలో యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకడు రామ్ పోతినేని. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ గారి అబ్బాయి గా ‘దేవదాసు’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రామ్ నటన గురించి అందరూ ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. కొత్త కుర్రాడు అయినా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అదరగొట్టేసాడు అని అందరూ అనుకున్నారు. ఇక ఆ తర్వాత రామ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘రెడీ’, ‘మస్కా’, ‘కందిరీగ’, ‘నేను శైలజ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘ఇస్మార్ట్ శంకర్’ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి మార్కెట్ ని తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ గా రామ్ చేసిన చిత్రాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

    ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆయన చేసిన ‘రెడ్’, ‘ది వారియర్’,’స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటీ సినిమాలు ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. సాధారణంగా వరుస ఫ్లాప్స్ వచ్చిన హీరోలు తమ తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ని బాగా తగ్గిస్తారు. కానీ రామ్ మాత్రం రెమ్యూనరేషన్ విషయం లో అసలు తగ్గేదే లేదు అని అంటున్నాడు. తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడుగుతున్నాడు. రామ్ నటించిన సినిమాలలో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి ఒక్కటే 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మిగిలిన అన్ని చిత్రాలకు 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ల కంటే తక్కువే వచ్చాయి. అలాంటి రామ్ పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడగడం ఏమైనా న్యాయం గా ఉందా?..ఒకప్పుడు అయితే రామ్, నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు ఎంత రెమ్యూనరేషన్ అడిగిన నిర్మాతలు కాదనే వారు కాదు. ఎందుకంటే గత ఏడాది వరకు డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్స్ కి అమ్ముడుపోయేవి. థియేట్రికల్ రైట్స్ తో సమానంగా వాటి బిజినెస్ జరిగేది కాబట్టి రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ మార్కెట్ బాగా పడిపోయింది.

    ఓటీటీ సంస్థల అధినేతలు ఒకప్పుడు ఇచ్చిన ఫ్యాన్సీ రేట్స్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు, అందుకే నిర్మాతలు కూడా హీరోలు అడిగినంత ఇవ్వలేకపోతున్నారు. దానికి తోడు రామ్ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఓటీటీ లో కూడా ఆయన సినిమాలకు అంతంత మాత్రమే ఆదరణ దక్కింది. దీంతో నిర్మాతలు రామ్ అడిగినంత ఇవ్వలేక ఆయన దగ్గరకు రావడం కూడా మానేశారట. ఇక మొదటికే మోసం వచ్చేలా ఉంది అని అర్థం చేసుకున్న రామ్, తన దగ్గరకి వచ్చే నిర్మాతలకు రెమ్యూనరేషన్ కి బదులుగా రెండు ప్రాంతాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కోరాలని నిర్ణయించుకున్నాడట. మరి నిర్మాతలు ఇప్పటికైనా ఆయన వద్దకు సినిమాలు చేసేందుకు వస్తారో లేదో చూడాలి.