H 1B Visa New Rules: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లతో ఇప్పటికే భారత్‌ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని అమెరికా కంపెనీలను ఆదేశించారు. తాజాగా హెచ్–1బీ వీసాలకు ఏటా లక్ష డాలర్ల (సుమారు 84 లక్షల రూపాయలు) అదనపు ఫీజు చెల్లించాలన్న ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇప్పుడు ఈ మార్పు ద్వారా కంపెనీలు ప్రతి వీసాకు భారీ ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. ఈ వీసా కూడా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుబాటవుతాయి. ఈ చర్య ద్వారా, ట్రంప్ ప్రభుత్వం విదేశీయుల రాకకు చెక్ పెట్టాలని చూస్తోంది. వాణిజ్య మంత్రి హొవర్డ్ లట్నిక్ మాట్లాడుతూ, ‘ఇది అమెరికన్ యువతకు శిక్షణ అవకాశాలను పెంచుతుంది, విదేశీయులను తక్కువ జీతాలకు బదలాయించకుండా చూస్తుంది‘ అని చెప్పారు.
Also Read: 22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?
భారతీయులపై ప్రభావం..
కొత్త హెచ్–1బీ వీసా నిబంధన భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతేడాది (2024) హెచ్–1బీ వీసాలలో 71% భారతీయులకే లభించాయి. చైనా 11.7%తో రెండో స్థానంలో ఉండగా, ఈ వీసాలు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు, హెల్త్‌కేర్ నిపుణులకు ఉపయోగపడతాయి. భారతీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఈ ఫీజు పెరుగుదల వల్ల వాటి షేర్లు 2 నుంచి 5% వరకు పడిపోయాయి. 2025 మొదటి అర్ధవార్షికంలోనే అమెజాన్ 12 వేలకుపైగా, మైక్రోసాఫ్ట్, మెటా ప్రతి ఒక్కటి 5 వేలకుపైగా వీసాలు పొందాయి. కానీ ఇకపై ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. భారతీయ విద్యార్థులు, యూఎస్ విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లు కూడా ఈ వీసాల ద్వారా ఉద్యోగాలు పొందుతారు, కానీ ఈ ఫీజు వల్ల వారి అవకాశాలు పరిమితమవుతాయి. ఇది భారతీయ ఐటీ ఎగుమతులు, రెమిటెన్స్‌లపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
అమెరికన్ యువత కోసమేనా?
ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యను ‘అమెరికా ఫస్ట్‘ విధానంలో భాగంగా చూస్తోంది. వారి వాదన ప్రకారం, హెచ్–1బీ కార్యక్రమం విదేశీయులను తక్కువ జీతాలకు (సుమారు 60,000 డాలర్లు) నియమించడం ద్వారా అమెరికన్ కార్మికులను(లక్ష డాలర్లు పైగా) దెబ్బతీస్తోంది. లేబర్ డిపార్ట్‌మెంట్‌కు ప్రవర్తనా నియమాలను సవరించమని ఆదేశించడం ద్వారా, వీసా కార్మికుల జీతాలను పెంచి, స్థానికులకు పోటీని తగ్గించాలని లక్ష్యం. ఇది 65,000 మాములు + 20,000 అధునాతన డిగ్రీలు వీసాల సంఖ్యను మరింత తగ్గించవచ్చు. ఎందుకంటే లాటరీ విధానం ఇప్పటికే 20% మాత్రమే ఆమోదాన్ని ఇస్తోంది. ట్రంప్ మాట్లాడుతూ, ‘మనకు అత్యుత్తమ ప్రతిభలు కావాలి, కానీ అమెరికన్ యువతను మొదట ప్రోత్సహించాలి‘ అని స్పష్టం చేశారు. ఇది టెక్ రంగంలో ఉద్యోగాలను స్థానికులకు మళ్లించేందుకు ఉద్దేశించబడింది.
ఈ విధానానికి టెక్ దిగ్గజాలు, ఎలాన్ మస్క్ వంటి నిపుణులు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే ఇది అమెరికా పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. ఇమిగ్రేషన్ కౌన్సిల్ పాలసీ డైరెక్టర్ ఆరన్ రైఖ్లిన్–మెల్నిక్, ‘కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇటువంటి ఫీజులు చట్టవిరుద్ధం‘ అని హెచ్చరించారు. ఇప్పటికే ‘గోల్డ్ కార్డ్‘ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు, ఇది 10 లక్షల డాలర్లు చెల్లించగల విదేశీయులకు వేగవంతమైన వీసాలు ఇస్తుంది, కానీ ఇది సామాన్య ఐటీ నిపునులకు కష్టమైంది ఈ మార్పు ఐటీ రంగంలో ఉద్యోగాలు 20–30% తగ్గించవచ్చు. భారతీయులు కెనడా, యూరప్ వంటి దేశాల వైపు మళ్లవచ్చు. మొత్తంగా, ఇది ట్రంప్ ఇమిగ్రేషన్ క్రాక్‌డౌన్‌లో మరో మైలురాయి. కానీ దీర్ఘకాలికంగా అమెరికా ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారవచ్చు.