Bigg Boss 9 Telugu Voting: చూస్తూ ఉండగానే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మొదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. రెండవ వారం హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు భరణి, ఫ్లోరా షైనీ, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, ప్రియ, మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్. వీరిలో ప్రస్తుతానికి అందరికంటే అత్యధిక ఓట్లతో కొనసాగుతున్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఈయనని అందరూ మంచి వాడు అని ఫీల్ అవుతున్నారు, దానికి తోడు ఆయన చేసే పనులన్నీ కూడా అమాయకత్వంతో కూడిన విధంగానే ఉన్నాయి. అందుకే ఒక రేంజ్ లో ఆడకపోయినా కూడా సుమన్ శెట్టి ఓటింగ్ వేరే లెవెల్ లో పడుతుంది. కానీ ఇదే సానుభూతి ప్రతీ వారం ఉంటుందా అంటే అనుమానమే. కాబట్టి సుమన్ శెట్టి ఇక నుండి అగ్రెస్సివ్ గా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవ స్థానం లో భరణి కొనసాగుతున్నాడు.
Also Read: 22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?
ఈ వారం భరణి కి పాజిటివ్ ఎపిసోడ్స్ చాలానే పడ్డాయి. కామనర్స్ మొత్తం ఆయన్ని టార్గెట్ చేసి నామినేట్ చేయడం జనాలకు అసలు నచ్చడం లేదు. అంతే కాకుండా రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్ లో భరణి చేసిన అన్యాయం పై కూడా జనాల్లో సానుభూతి పెరిగింది. ఫైల్తంగా ఆయనకు భారీ ఓటింగ్ కొనసాగుతుంది. ఇక మూడవ స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ డిమోన్ పవన్. ఇతనికి ఈ వారం మొత్తం నెగిటివ్ ఎపిసోడ్స్ బలంగా పడ్డాయి. అయినప్పటికీ కూడా ఆడియన్స్ లో ఇతనిపై కాస్త అమాయకుడు అనే సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే ఈయనకి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ దాదాపుగా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సోషల్ మీడియా లో ప్రియ పై ఒక క్యాంపైన్ నడుస్తుంది. ఈమెని ఎలా అయినా ఎలిమినేట్ చెయ్యాలని ఒక సెక్షన్ గ్రూప్ స్ట్రాటజీ వేసింది.
ఫ్లోరా షైనీ ప్రస్తుతానికి తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రియ సేఫ్ గానే ఉంది. కాబట్టి ఫ్లోరా షైనీ కి ఓట్లు బలంగా వెయ్యండి, ప్రియ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అని ఒక క్యాంపైన్ రన్ చేశారు. కానీ దీని వల్ల ఎలాంటి ఫలితం రాలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళబోయేది ఫ్లోరా షైనీ నే అని ఖరారు అయ్యింది. మనీష్ కి కూడా చాలా తక్కువ ఓటింగ్ పడింది కానీ, ఈసారి వరకు ఆయన సేఫ్ అయిపోయాడు. కానీ ఓవర్ గా ఆలోచించడం ఇకనైనా ఆపకపోతే మనీష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు వచ్చే వారంలో. వాస్తవానికి మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. కానీ ఆయన మళ్లీ కంటెస్టెంట్స్ తో కలిసి బాగానే ఉన్నాడు, దీంతో ఆయన ఓటింగ్ కూడా పెరిగింది. అందుకే ఆయన ఓటింగ్ లైన్ లో నాల్గవ స్థానం లో కొనసాగుతున్నాడు.