Lokah Movie Collection: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్స్ గా నిల్చినవి చాలానే ఉన్నాయి. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వగా, అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు మాత్రం ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘లోక'(Lokah Movie). మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం లో కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్ర పోషించింది. మలయాళం లో మోహన్ లాల్ సినిమాల రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టిన ఈ చిత్రం 22 రోజులు పూర్తి చేసుకోగా బాక్స్ ఆఫీస్ వద్ద 262 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇంత వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఎందుకో తెలుగు వెర్షన్ లో ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టి ఉంటే బాగుండేది అనిపించింది.
Also Read: ‘భద్రకాళి’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?
ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేశాడు. కేవలం మూడు కోట్ల రూపాయిల పెట్టుబడి తో ఆయన దాదాపుగా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా లాభాలను సొంతం చేసుకున్నాడు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకు 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, 7 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఎక్కువ వసూళ్లు రావొచ్చు, కానీ ఎందుకో అనుకున్న టార్గెట్ ని చేరుకోలేదు అనిపించింది. తెలుగు లో బిజినెస్ ప్రకారం చూస్తే డబుల్ బ్లాక్ బస్టర్ కానీ, కనీసం 30 కోట్ల షేర్ వచ్చి ఉండుంటే బాగుండేది అని విశ్లేషకుల అభిప్రాయం. ఇక మిగిలిన భాషల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కేరళ నుండి 96 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళ నాడు నుండి 18 కోట్లు, కర్ణాటక నుండి 13 కోట్లు,రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 7 కోట్ల 30 లక్షలు, ఓవర్సీస్ నుండి 112 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 262 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 115 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.