NDA Victory Celebrations: న్యూజెర్సీలో ఎన్డీఏ గెలుపు సంబరాలు..

కొత్త ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని ఆఫ్‌ బీజేపీ వాసుదవ్‌ పటేల్‌ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడోసారి ఎన్నికైన నాయకుడు నరేంద్రమోదీనే అని పేర్కొన్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 15, 2024 10:37 am

NDA Victory Celebrations

Follow us on

NDA Victory Celebrations: భారత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీ చారిత్రక విజయం సాధించడంతో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారతీయ అమెరికన్‌ కమ్యూనిటీ సంబరాలు చేసుకుంది. ఆఫ్‌ బీజేపీ అమెరికా అధ్యక్షుడు డాక్టర్‌ అడపా ప్రసాద్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై భారత సంతతి అమెరికన్ను హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి 800 మందికిపైగా ప్రజలు హాజరయ్యారు.

సాంస్కృతిక ప్రదర్శనలు..
ఈ వేడుకలు ఉత్సాహ భరితమైన డోల్‌ తాషా ప్రదర్శనలు, ఎన్నారైల నృత్యాలతో మొదలయ్యాయి. బీజేపీ విజయానికి గుర్తుగా ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని ఆనందభరితంగా నిర్వహించారు. దీనికి వ్యాఖ్యతగా జోత్స ్న వ్యవహరించారు. ఆఫ్‌ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ అడపా ప్రసాద్‌ ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా, ఎన్డీఏ కూటమి భాగస్వాములకు అభినందనలు తెలిపారు. 1962 తర్వాత తొలిసారిగా వరుసగా మూడోసారి ప్రజలు బీజేపీకి అధికారం అప్పటించారని అన్నారు. కొత్త ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని ఆఫ్‌ బీజేపీ వాసుదవ్‌ పటేల్‌ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడోసారి ఎన్నికైన నాయకుడు నరేంద్రమోదీనే అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయాన్ని ప్రశంసించారు. 2029లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.