Earth: భూమి ఆయుష్సు ఎంత.. ఇంకా ఎన్నేళ్లు మిగిలి ఉంది?

భూమి సలక జీవరాశికి ఆధారం. ప్రస్తుతం విశ్వంలో భూమిపై మాత్రమే జీవులు నివసిస్తున్నాయి. భూమి తిరగడం వల్ల భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.

Written By: Raj Shekar, Updated On : June 15, 2024 10:42 am

Earth

Follow us on

Earth: సౌర కుటుంబంలో ఇప్పటి వరకు జీవరాశి ఉన్న ఏకైక గ్రహం భూమి. నీటితోపాటు సమతుల వాతావరణం మన భూమి మీదనే ఉంది. ఇక శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై జీవం గురించి పరిశోధనలు చేస్తున్నారు. జీవరాశి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇన్ని గ్రామాలు ఉన్నా.. మన నివసించే భూమి మాత్రం కొన్నేళ్లకు అంతం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో భూమి జీవిత కాలం ఎంత.. ఇప్పటి వరకు ఎన్నేళ్లు గడిచింది.. ఇంకా ఎన్నేళ్లు మిగిలి ఉంది అనే వివరాలు తెలుసుకుందాం.

సలక జీవరాశికి ఆధారం..
భూమి సలక జీవరాశికి ఆధారం. ప్రస్తుతం విశ్వంలో భూమిపై మాత్రమే జీవులు నివసిస్తున్నాయి. భూమి తిరగడం వల్ల భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది సూర్యుడి నుంచి వేచ్చే ప్రమాదకరమైన అణువులు, కాస్మిక్‌ కిరణాలను తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి జీవావరణాన్ని రక్షిస్తుంది. ఇది భూమి చుట్టూ కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది.

అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే..
ఈ అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవడం ఖాయం. భూమిమీద ఉన్నవన్నీ నశిస్తాయి. భూమి కూడా ఇందుకు అతీతం కాదు. అయితే ఎప్పుడు జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది మాత్రం తెలియదు.

5 బిలియన్‌ సంవత్సరాల క్రితం..
సౌర వ్యవస్థ ఏర్పడి 4 నుంచి 5 బిలియన్‌ సంవత్సరాలు అయిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమి కూడా అప్పుడే ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఇక భూమిపై జీవరాశి మనుగడకు సూర్యరశ్మి కూడా కారణం. అంటే సూర్యుడు ఉన్నంతకాలం భూమి ఉంటుంది. సూర్యుడిలోని అనేక అనువులు ప్రతిచర్య జరుగుతాయి. అణు ప్రతిచర్య ఆగిపోతే సూర్యుడు విస్తరిస్తాడు. ఈ రెండ్‌ జెయింట్‌ భూమిని చుట్టుముడుతుంది. ఇది భూమి అంతానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక సూర్యుడు మరో 5 బిలియన్‌ ఏళ్లపాటు మండుతూనే ఉంటాడని భావిస్తున్నారు. అప్పటి వరకు భూమికి భూ గ్రహానికి ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు.