https://oktelugu.com/

NATS: అమెరికాలో తెలుగువారి ఆరోగ్యం కోసం.. నాట్స్ గొప్ప పని

అమోరికా నాట్స్‌ ఫ్లోరిడాలోని టంపాబేలో యోగా వర్క్‌షాప్‌ నిర్వహించింది. స్థానిక శక్తియోగాలయతో కలిసి నాట్స్‌ ఏర్పాటు చేసిన ఈ వర్క్‌షాప్‌లో టంపాబేలో ఉండే తెలుగువారు వినియోగించుకున్నారు.

Written By: , Updated On : February 22, 2024 / 10:28 AM IST
NATS
Follow us on

NATS: భారతీయ ప్రాచీన కళల్లో యోగా ఒకటి. కానీ మన దేశంలోనే యోగా సాధన తగ్గింది. అయితే ఇదే యోగాను పాశ్చాత్య దేశాలు సాధన చేస్తూ అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. పుట్టినిల్లు అయిన భారత్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే మళ్లీ యోగాపై దృష్టి పెడుతున్నారు. మన దేశం నుంచి నేర్చుకున్న యోగాను.. ఇప్పుడు మనం విదేశాలకు వెళ్లి నేర్చుకోవాల్సి వస్తోంది.

– నాట్స్ ఫ్లోరిడాల్లో..
అమోరికా నాట్స్‌ ఫ్లోరిడాలోని టంపాబేలో యోగా వర్క్‌షాప్‌ నిర్వహించింది. స్థానిక శక్తియోగాలయతో కలిసి నాట్స్‌ ఏర్పాటు చేసిన ఈ వర్క్‌షాప్‌లో టంపాబేలో ఉండే తెలుగువారు వినియోగించుకున్నారు. అనుభవజ్ఞలైన శిక్షకులు ఈ వర్క్‌షాప్‌లో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆసనాలు నేరిపంచారు. శారీరక శక్తి, మానసిక శక్తికి ఎలాంటి ఆసనాలు వేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. యోగాను దినచర్యలో భాగంగా మార్చుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని సూచించారు.

-ఎన్‌ఆర్‌ఐల సహకారం..
ఈ కార్యక్రమ నిర్వహణకు నాట్స్‌ మాజీ చైర్మన్, నాట్స్‌ సంబరాల 2025 కన్వీనర్‌ శ్రీనివాస్‌ గుఇ్తకొండ, నాట్స్‌ బోర్డు గౌరవ సభ్యులు కొత్త శేఖరం, నాట్స్‌ బోర్డు చైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేని, నాట్స్‌ బోర్డు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మల్లాది, నాట్స్‌ కార్యనిర్వాహక కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌(ఫైనాన్స్‌/మార్కెటింగ్‌), భాను దూళిపాళ్ల, ప్రోగ్రాం నేషనల్‌ కో ఆర్డినేటర్‌ రాజేశ్‌ కాండ్రు, జాయింట్‌ ట్రెజరర్‌ సుధీర్‌ మిక్కిలినేని, సలహాక కమిటీ సభ్యులు ప్రసాద్‌ ఆరికట్ల, సురేశ్‌ బొజ్జా, చాప్పర్‌ కోఆర్డినేటర్‌ సుమంత్‌ రామినేని, జాయింట్‌ కోఆర్డినేటర్‌ విజయ్‌కట్టా, కోర్‌ టీం తమవంతు సహకారం అందించారు. యోగా వర్క్‌షాప్‌ చేపట్టిన టంపాబే నాట్స చైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేనిని ప్రత్యేకంగా అభినందించారు.

-తెలుగు వారి కోసం..
అమెరికాలో ఉంటున్న తెలుగు వారి ఆరోగ్యం కోసమే ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు టంపాబే నాయకులు తెలిపారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా చాలా వరకు దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన సెక్రెటరీ చాగంటి రంజిత్, ఎగ్జిక్యూటివ్‌ మీడియా సెక్రెటరీ మురళీకృష్ణ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.