NATS: వైద్య విద్యార్థులకు నాట్స్‌ అవగాహన

డాక్టర్‌ చదవాలనుకునే విద్యార్థులు అమెరికాలో నిర్వహించే ఎంక్యాట్‌కు ఎలా సన్నద్ధం కావాలి.. ఏయే అంశాల మీద పట్టు సాధించాలి.. అందుకు అవలంబించాల్సిన మార్గాలు, ఏయే అంశాలు నేర్చుకోవాలి.

Written By: Raj Shekar, Updated On : July 5, 2024 9:39 am

NATS

Follow us on

NATS: అమెరికాలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు అత్యంత కీలకమైన ఎంక్యాట్‌పై నాట్స్‌(నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌) అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన ఈ సదస్సులో మెడికల్‌ విద్యార్థులకు దిశానిర్దేశం చేసింది. ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన తెలుగు విద్యార్థి శ్రీచరణ్‌ మంచికలపూడి తన విజయానికి బాటులు వేసిన మార్గాలను వివరించారు.

ఎలా సన్నద్ధం కావాలి…
ఇక డాక్టర్‌ చదవాలనుకునే విద్యార్థులు అమెరికాలో నిర్వహించే ఎంక్యాట్‌కు ఎలా సన్నద్ధం కావాలి.. ఏయే అంశాల మీద పట్టు సాధించాలి.. అందుకు అవలంబించాల్సిన మార్గాలు, ఏయే అంశాలు నేర్చుకోవాలి.. ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కుల కోసం ఎలా కృషి చేయాలి తదితర అంశాలపై శ్రీచరణ్‌ మంచికలపూడి ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు వివరించారు.

నాట్స్‌ సేవా కార్యక్రమాలపై..
కార్యక్రమం ప్రారంభంలో నాట్స్‌ అధ్యక్షుడు మదన్‌ పాములపాటి తెలుగు విద్యార్థుల కోసం నాట్స్‌ చేసడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సదస్సుకు సంకీర్త్‌ కటకం వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆన్‌లైన్‌లో వైద్య విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించిన శ్రీచరణ్‌ మంచికలపూడికి నాట్స్‌ బోర్డ్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags