Junior NTR: ఎన్టీయార్ నాటుకోడి కూర వేస్ట్ అయిపోయిందా..? ప్రశాంత్ నీల్ హ్యాండిచ్చాడా..?

ఎన్టీఆర్ కి ఆయన ఎంటైర్ కెరీర్ లో ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్టు లేకపోవడం నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ట్రేడ్ లో తన మార్కెట్ తగ్గకుండా ఉండే విధంగా చూసుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : July 5, 2024 9:31 am

Junior NTR

Follow us on

Junior NTR: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా ఎదగడమే కాకుండా యంగ్ టైగర్ గా కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఈయన ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. అలాగే ఇండస్ట్రీ లో ఎవ్వరికీ లేని విధంగా మాస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎన్టీఆర్ కి ఆయన ఎంటైర్ కెరీర్ లో ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్టు లేకపోవడం నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ట్రేడ్ లో తన మార్కెట్ తగ్గకుండా ఉండే విధంగా చూసుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే కే జి ఎఫ్, సలార్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని పట్టు పట్టుకొని కూర్చున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకునే లోపే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఒక దిమ్మ తిరిగిపోయే న్యూస్ చెప్పాడు. అదేంటి అంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు అంట. సలార్ 2 అయిపోతే గాని ఎన్టీఆర్ తో సినిమాను స్టార్ట్ చేయలేడట. కాబట్టి ఈ లోపు ఈజీగా 2 ఇయర్స్ పట్టేస్తుందనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా అదే డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఇంట్లో నాటు కోడి కూర ను స్వయం గా తనే వండుకొని బెంగళూరు వెళ్లి మరి ప్రశాంత్ నీల్ ను కలిసి తను తీసుకెళ్లిన కర్రీ ని ఆయనకి తినిపించాడు…ఇక ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ కోసం వండిన నాటు కోడి కూర తిని కూడా ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కి హ్యాండ్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…