America: అమెరికాలో హైదరాబాద్‌ వాసి కిడ్నాప్‌.. వాళ్ల డిమాండ్‌ తెలుసా?

కొన్ని రోజుల క్రితం భరతన్యా, కూచిపడి నృత్యకళాకారడు అమర్‌నాథ్‌ను దుండగులు కాల్పి చంపారు. ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతిచెందాడు.

Written By: Raj Shekar, Updated On : March 21, 2024 9:31 am

America

Follow us on

America: దేశం నుంచి విదేశాలకు వెళ్తున్నవారిలో అమెరికాకు వెళ్లేవారే ఎక్కువ. ఏటా భారత్‌ నుంచి విదేశాలకు వెళ్తున్నవారిలో అమెరికా వెళ్తున్నవారే 60 శాతం మంది ఉన్నారు. అయితే మూడు నెలలుగా అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అమెరికా వెళ్లాలంటేనే భయపడుతున్నారు భారతీయులు.

మొన్నటి వరకు క్రేజ్‌..
అమెరికా అంటే మొన్నటి వరకు విపరీతమైన క్రేజ్‌. స్టడీజ్, ఎంజాయ్‌మెంట్, ఉద్యోగం ఏదైనా అబ్రాడ్‌ అనగానే గుర్తుకు వచ్చేది అమెరికా. కానీ ఇప్పుడు అమెరికా అంటే అయ్య బాబోయ్‌ అంటున్నారు ఇండియన్స్‌. ఎందుకంటే.. అక్కడ వరుసగా భారతీయులపై జరుగుతున్నా దాడులు, హఠాన్మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని వారాల్లో ఐదారుగురు మరణించారు. ఇందులో తెలుగు వ్యక్తులు ఉండటం గమనార్హం. ఇక దాడుల సంగతి చెప్పనక్కర్లేదు. లెక్కలేనన్నీ జరుగుతున్నాయి. జాతి వివక్షత లేక సైకోయిజమా తెలియదు కానీ ఇండియన్స్‌ను టార్గెట్‌ చేశారు కొంత మంది అమెరికన్‌ పీపుల్స్‌.

ఇటీవల జరిగిన ఘటనలు..
కొన్ని రోజుల క్రితం భరతన్యా, కూచిపడి నృత్యకళాకారడు అమర్‌నాథ్‌ను దుండగులు కాల్పి చంపారు. ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతిచెందాడు. అది మర్చిపోక ముందు మరో తెలుగు విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన అభిజిత్‌ బోస్టర్‌ను బోస్టన్‌ యూనివర్సిటీలో కాల్చి చంపారు.

తాజాగా కిడ్నాప్‌..
తాజాగా హైదరాబాద్‌ వాడిన్నాప్‌ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన అమ్మద్‌ అలీం కుమారుడు అబ్దుల్‌ అహ్మద్‌(25) కొన్ని రోజులుగా కనిపించడం లేద. అక్కడ క్లేవ్‌ ల్యాండ్‌ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ విభాగంలో మాస్టర్స్‌ చేస్తున్నాడు. వారం రోజులుగా అతనికి సంబంధించిన సమాచారం మార్చి 7 నుంచి తెలియడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు క్లేవ్‌ల్యాండ్‌ పోలీసలకు ఫిర్యాదుచేశారు.

కిడ్నాపర్ల డిమాండ్ ఇదీ..
అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు లుక్‌ఔట్‌ నోటీసలు జారీ చేశారు. అబ్దుల్‌ కోసం అతడి కుటుంబ సభ్యులు మార్చి 18న చికాగోలోని భారతీయ కాన్సులేట్‌ సభ్యులకు ఫిర్యాదు చేశారు.
ఇంతలో అబ్దుల్‌ కిడ్నాపర్స్‌ నుంచి అతని తండ్రి సలీంకు ఫోన్‌ వచ్చింది. అతడిని విడిచిపెట్టాలంటే 1200 డాలర్లు ఇవ్వాలని తెలిపారు. లేదంటే అతడిని కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించారు.వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అబ్దుల్‌ కోసం గాలిస్తున్నారు.