https://oktelugu.com/

Shriya Saran: పెళ్లయి, బిడ్డకు తల్లయినా.. శ్రియా ఏ మాత్రం తగ్గడం లేదుగా.. వైరల్ ఫోటోలు

శ్రియా పెళ్లయినప్పటికీ పలు భాషల్లో నటిస్తూనే ఉంది. ఈ పాత్ర మాత్రమే చేస్తాను అని గిరి గీసుకోవడం లేదు. అందాలను ప్రదర్శించే అవకాశం వచ్చినా వెనక్కు తగ్గడం లేదు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయిన తర్వాత అందాల ప్రదర్శనకు ఒప్పుకోరు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 21, 2024 / 08:53 AM IST

    Shriya Saran

    Follow us on

    Shriya Saran: అప్పుడప్పుడో ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఢిల్లీ బ్యూటీ శ్రియ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో నటించింది. రష్యా కు చెందిన అండ్రి కొశ్చివ్ అనే యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కూతురు ఉంది.. పెళ్లయి, ఓ పిల్లకి తల్లయినా శ్రీయ ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా అంటుంటే కొంతమందికి కోపం రావచ్చు. తాతలైన హీరోలు.. తమ మనవరాళ్ల వయసున్న హీరోయిన్లతో డ్యూయెట్లు పాడంగా లేనిది.. శ్రియ నటిస్తే తప్పేముంది.. అని ప్రశ్నించొచ్చు. పైగా అందులో తప్పేమీ లేదు. అయితే మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే భారతీయ చిత్ర పరిశ్రమలో.. ఒక హీరోయిన్ తల్లయిన తర్వాత కూడా ఈ రేంజ్ లో అవకాశాలు దక్కించుకోవడం అంటే మాటలు కాదు.

    శ్రియా పెళ్లయినప్పటికీ పలు భాషల్లో నటిస్తూనే ఉంది. ఈ పాత్ర మాత్రమే చేస్తాను అని గిరి గీసుకోవడం లేదు. అందాలను ప్రదర్శించే అవకాశం వచ్చినా వెనక్కు తగ్గడం లేదు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయిన తర్వాత అందాల ప్రదర్శనకు ఒప్పుకోరు. కానీ శ్రియ అలాంటి అడ్డంకులను దర్శకుల ముందు పెట్టడం లేదు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాగైనా నటించడానికి తనకు అభ్యంతరం లేదని చెబుతోంది. అందువల్లే కొన్ని కొన్ని పాత్రలను శ్రియాను దృష్టిలో ఉంచుకునే దర్శకులు రూపొందిస్తున్నారు. కెమెరా సినిమాల్లోనే కాదు.. అధునాతన దుస్తులు ధరించి ఫోటో షూట్ ల ద్వారా శ్రియ అందాలను ప్రదర్శిస్తున్నది.

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రియ.. కురచ దుస్తులు వేసుకొని దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంది. తన కెరియర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు బి** ధరించని శ్రియ.. ఇటీవల ఓ సముద్రపు బీచ్ లో బి** ధరించి ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం శ్రియ మోడ్రన్ దుస్తులు ధరించి ఫోటోషూట్ పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఉన్నావే.. ఎవరే నువ్వు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో శ్రియ తన వయసును వెనక్కి మళ్ళిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి.