NRI News : ఉన్నత విద్య, ఉద్యోగం కోసం నాలుగేళ్ల క్రితం విదేశాలకు వెళ్లింది భారత యువతి. నాలుగేళ్లు అక్కడే ఉండిపోయింది. జూన్ 20న తిరిగి ఇంటికి బయల్దేరింది. కానీ ఇంటికి చేరకుండానే కన్నుమూసింది. ఈ విషాధ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఢిల్లీకి చెందిన మన్ ప్రీత్ కౌర్(24) నాలుగేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటుంది. చదువు పూర్తి కావడంతో జూన్ 20న మెల్బోర్న్ నుంచి న్యూ ఢిల్లీకి బయలుదేరింది. క్వాంటాస్ విమానాన్ని ఎక్కేందుకు తుల్లామరైన్ ఎయిర్పోర్ట్‌కు చేరుకుంది.
విమానాశ్రయంలో అస్వస్థత..
విమానం కోసం ఎయిర్ పోర్టులో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. అయినా ఓపిక తెచ్చుకుని అక్కడే ఉంది. విమానం రాగానే అనార్యోగంతోనే వెళ్లి విమానం ఎక్కి కూర్చుంది మన్‌ప్రీత్ కౌర్. సీట్‌బెల్ట్ పెట్టుకుంటూ ఉండగానే కుప్పకూలింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విమాన సిబ్బంది, అత్యవసర సేవలు, వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు. మన్‌ప్రీత్ కౌర్ క్షయ వ్యాధితో మరణించి ఉండవచ్చునని భావస్తున్నారు.
బాధిత కుటుంబానికి..
మన్‌ప్రీత్ కౌర్ మరణ వార్త తెలుసుకున్న ఆమ స్నేహితుడు, కౌర్ గ్రామానికి చెందిన గుర్జీప్ గ్రేవాల్ మృతదేహాన్ని దేశానికి తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె అకాల మరణం తమను ఎంతగానో బాధించిందని పేర్కొన్నాడు. తను లేని లోటు తీరనిదంటూ గ్రేవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కౌర్ తను చెఫ్ కావాలని కోరుకుందని గుర్తు చేశాడు.