Crime News : పాఠాలు చెప్పాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొంది. ఇటీవలే ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనల అమెరికాలోని న్యూజెర్సీలో ఫ్రీహోల్డ్ ఇంటర్మీడియట్ పాఠశాలలో జరిగింది.
-43 ఏళ్ల టీచర్..
ఎలీసన్ హవెమాన్ అనే 43 ఏళ్ల మహిళ ఇంటర్మీడియెట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది మొదటినుంచి ఆమె విద్యార్థులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె మాన్హాట్టన్ కౌంటీ జైలులో ఉంది. కాగా, టీచర్ బాధితుడైన మైనర్ విద్యార్థి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
-టీచర్ బాధితుల వివరాలు సేకరణ..
ఇదిలా ఉంటే అమెరికా పోలీసులు టీచర్ బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం ఎలీసన్ హవెమాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు వెల్లడించారు. ఇక ఎలీసన్ లాయర్ మాత్రం తన క్లయింట్ నిర్దోషి అని చెబుతున్నాడు.
-సోషల్ మీడియాలో..
ఇదిలా ఉంటే ఎలీసన్ లింక్డ్ ఇన్ ఖాతాలో మాత్రం తాను ఎంతో మంచి టీచర్‌గా పేర్కొంది. ఫలితాల కోసం పనిచేసే సిన్సియర్ ఎడ్యుకేటర్న్ అని వెల్లడించింది. ఎలీసన్ 2022 నుంచి ప్రీహోల్డ్ స్కూల్లో పనిచేస్తోంది. అంతకు ముందు పలు పాఠశాలల్లోను విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమె వద్ద 6 నుంచి 8వ గ్రేడ్ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి వయస్సు 14ఏళ్ల లోపే ఉంటుంది.