Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు ఆంజనేయుడి అనుగ్రహం..

ఆర్థికంగా పుంజుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : July 2, 2024 8:10 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 జూలై 2 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు అంజనేయుడి అనుగ్రహం వలన కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈరాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గతంలో ఏర్పాటు చేసుకున్న ఆశయాలను నెరవేర్చుకుంటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

వృషభ రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది.. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు.

మిథున రాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సంస్థలు మారే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది.

సింహారాశి:
వ్యాపారస్తుులు కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు. ఉద్యోగులు తమ బాధ్యతలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

కన్య రాశి:
ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

తుల రాశి:
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని పనుల కారణంగా ఉద్యోగులు బిజీగా ఉంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:
కొత్తగా పెట్టుబడిపెట్టాలనుకునేవారు ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు అనుకోని అదృష్టం ఉంటుంది. పాత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ధనస్సు రాశి:
వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్నిపనుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

మకర రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మానసికంగా కుంగిపోతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

కుంభరాశి:
ఉద్యోగులు సీనియర్ల కు మద్దతుగా ఉండాలి. అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండొద్దు. ఆదాయం పెరుగుతుంది.

మీనరాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడుతాయి. ఆదాయం పెరిగేందుకు అవకాశాలు వస్తాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.