Heart Attacks NRIs: విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన వారు అక్కడ బాగా సంపాదిస్తున్నారని, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని చాలా మంది భారతీయులు భావిస్తుంటారు. కానీ ఎక్కడి ఒత్తిడి అక్కడ ఉంటుంది. ఇందుకు అమెరికా, కెనడాలో తాజాగా సంభంవిస్తున్న గుండెపోటు మరణాలే నిదర్శనం. గడిచిన మూడు నెలల్లో అమెరికా, కెనడా, యూఏఈ వంటి దేశాల్లో ఎన్నారైలు ముఖ్యంగా యువకులు, మధ్య వయస్కులు హార్ట్ ఎటాక్‌తో మరణించారు. మన దేశం కన్నా విదేశాల్లో వైద్యసేవలు మెరుగ్గా ఉంటాయని భావిస్తారు. కానీ మరణాలు మాత్రం ఆగడ లేదు..
ప్రముఖుల మృతి..
గడిచిన మూడు నెలల్లో మృతిచెందినవారిలో ప్రముఖులు ఉన్నారు. అబ్హయ్ పట్నాలా (33), కార్తిక్ అరిసెట్టీ (36), హరిరాజ్ సుదేవన్ (37), రమణ్దీప్ సింగ్ గిల్ (40), సాయి కృష్ణ రామచందర్ రాజి అల్లూరి (37), ప్రతాప్ పాండే (35), మరియూ మరికొంతమందిని హార్ట్ ఎటాక్‌తో విదేశాల్లో మరణించారు. వరుస గుడెపోటు మరణాలు ఇప్పుడు ఎన్నారైల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మృతదేహాలను త్వరగా స్వదేశాలకు పంపించాలని ఆయా దేశాల ఎంబసీలకు వినతులు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్య పరిస్థితులు ప్రశ్నార్థకం..
వరుస గుండెపోటు మరణాలు ఇప్పుడు ఎన్నారైట ఆరోగ్య పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బీసీ, షుగర్, గుండెపోటు ఉన్నవారు తమ దేశంలోకి రావొద్దని ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో అమెరికా, కెనడాలో గుండెపోటు మరనాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ ఒత్తిడి, జీవనశైలి మార్పులు, కాన్సర్, హార్ట్ సంబంధిత రోగాలు యువతరంలో పెరుగుతున్నాయని వైద్య సంస్థలు సూచిస్తున్నాయి.
యువకుల్లో గుండెపోటు..
భారత్‌కు చెందిన 30 నుంచి 45 ఏళ్లలోపు వారు ఎక్కువగా హార్ట్ అటాక్‌తో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మరణాలు ఒక పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితి కోవిడ్–19 పాండమిక్ కారణంగా కూడా∙మరింత సంక్లిష్టమయ్యిందని విశ్లేషణలు ఉన్నాయని జాతీయ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో(నీసీఆర్‌బి) తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యులు, వ్యాపారులు నిపుణులుగా ఉన్న వారు కూడా గుండెపోటు మరణాల జాబితాలో ఉన్నారు. ఇది ఒక విషాదకరం మాత్రమే కాదు, ఒక సాంఘిక, ఆరోగ్య సవాలు కూడా అని భావిస్తున్నవారు. ఆర్థికంగా బలమైన, శ్రేంద్రీయ జీవన విధానాలు ఉన్న ఎన్నారైలు హార్ట్ ఎటాక్ మరణాల బారినఫడుతున్నారు.