Mana Shankara Vara Prasad Garu: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి(Anil ravipudi) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో చేస్తున్న చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad Garu). షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. రీసెంట్ గానీ ఈ చిత్రం నుండి విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం యూట్యూబ్ నుండే ఈ పాటకు 65 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఈ పాట కారణంగా ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ మేకింగ్ వీడియో ని విడుదల చేసింది మూవీ టీం.
ఈ మేకింగ్ వీడియో ని చూస్తే అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అంటే కుటుంబం మొత్తం కలిసి సరదాగా ఒక వెకేషన్ కి వెళ్లినట్టు ఉంటుంది అనేది అర్థం అవుతోంది. అంత సరదాగా షూటింగ్ సాగుతోందని ఈ వీడియో ని చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా వీడియో చివర్లో చిరంజీవి అనిల్ రావిపూడి వైపు చూపిస్తూ ‘అబ్బా..పిండేస్తున్నాడు అసలు’ అని అంటాడు. అదే విధంగా నయనతార తో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు బెడ్ రూమ్ లోపల నుండి కోపం గా వచ్చిన చిరంజీవి, వన్ మరి టేక్ అంటూ ఫన్ చేయడం చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా మేకింగ్ వీడియో అదిరిపోయింది, అయితే ఈ మేకింగ్ వీడియో లో చిరంజీవి తో పాటు విక్టరీ వెంకటేష్ షూటింగ్ పార్ట్ కి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా పెట్టి ఉండుంటే బాగుండేది అని అభిమానులు అంటున్నారు.
ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టినట్టు మూవీ టీం ఒక వీడియో ని విడుదల చేశారు. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే వెంకటేష్ దాదాపుగా 45 నిమిషాల వరకు సినిమాలో ఉంటాడని తెలుస్తోంది. చిరంజీవి కాంబినేషన్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు, అదే విధంగా ఆయన కాంబినేషన్ లో ఒక పాట కూడా ఉంటుందని టాక్. ఓవరాల్ గా చూస్తే ఈ సంక్రాంతి పోటీ కి వార్ వన్ సైడ్ లాగా ఉండేట్టు ఉందని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.