H1B Visa: అగ్రరాజ్య అమెరికా హెచ్ -1బీ వీసాలకు సంబంధించి కొత రూల్స్ సిద్ధం చేస్తోంది. ఈమేరు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) సన్నద్ధమవుతోంది. జూలై 8 నుంచి కొత్త రూల్స్ అమలు చేసే అవకాశం ఉంది. భారతీయ ఐటీ కంపెనీలు.. తమ కంపెనీ నిపుణులను అమెరికాలో పనిచేయడానికి హెచ్-1బీ వీసాలపై పంపిస్తాయి. హెచ్ -1బీ వీసాలు తీసుకునేవారిలో భారతీయులే ఎక్కువ.
మార్పులు ఇవీ..
హెచ్-1బీ వీసాల పొడగింపునకు 4 వేల డాలర్లు, ఎల్-1 వీసాల పొడిగింపునకు 4,500 డాలర్ల రుసుముతోపాటు 9/11 రెస్పాన్స్, బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజులను ప్రవేశపెట్టే ఆలోచనలో యూఎస్‌సీఐఎస్ ఉంది. బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు ప్రస్తుతం ప్రారంభ వీసా పిటిషన్లు, కంపెనీల మార్పులకు మాత్రమే వర్తిస్తోంది. గతేడాది అక్టోబర్ 23న యూఎస్‌సీఐఎస్ చేసిన ఈ ప్రతిపాదిత నిబంధన ప్రస్తుతం 60 రోజుల పరిశీలన దశలో ఉంది. ఈ ఏడాది చివరన లేదా ఎన్నికల తర్వాత బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనను ఖరారు చేసే అవకాశం ఉంది.
భారతీయులపైనే ఎక్కువ ప్రభావం..
హెచ్-1బీ వీసా నిబంధనల మార్పులు భారతీయ హెచ్ -1బీ వీసా ఉన్నవారితోపాటు కొత్తగా దరఖాస్తు చేసేవారికి ఇబ్బందిగా మారనున్నాయ.ఇ అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి ప్రయత్నిస్తున్న భారత్‌కు చెందిన వేలాదిమందిపై ప్రభావం ఉంటుంది. ప్రత్యేక వృత్తులు నిర‍్వహించడం ద్వారా హెచ్-1బీ అర్హత కలిగిన ఉద్యోగాలపై పరిమితులు ప్రవేశపెట్టడం, ఉద్యోగ పాత్రలు నేరుగా సంబంధిత నిర్దిష్ట ప్రత్యేకతల నేపథ్యంలో ఉద్యోగానికి దగ్గరగా ముడిపడి ఉన్న నిర్దిష్ట డిగ్రీలు అవసరమని నిర్దేశించడం పరిశీలనలో ఉన్న చర్చనీయాంశం.
భారీగా ఫీజు…
హెచ్-1బీ, ఎల్-1 వీసా పొడిగింపు కోసం కంపెనీలపై గణనీయమైన ఫీజులు పెంచాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హెూంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) యోచిస్తోంది. ఈ వీసాలపై 50 శాతంపైగా శ్రామిక శక్తి ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. వీసా పొడిగింపులపై ఆధారపడే కంపెనీలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది విదేశీ ఉద్యోగులకు సంబంధించి వారి నియామక వ్యూహాలను పునఃసమీక్షించడానికి ప్రేరేపిస్తుంది.