Gurpatwant Singh Pannun: పన్నూ హత్య కుట్ర కేసులో కీలక పరిణామం.. భారత సంతతి వ్యక్తి అమెరికాకు అప్పగింత!

నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అమెరికాకు అప్పగించడంతో ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ఫెడర్‌ మెట్రో పాలిటన్‌ నిర్భందంలో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అయితే కోర్టు విచారణ కోసం ఆయను అమెరికా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 11:44 am

Gurpatwant Singh Pannun

Follow us on

Gurpatwant Singh Pannun: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ హత్య కుట్రలో ప్రమేయం ఉందని భారత సంతతికి చెందిన నిఖిల్‌ గుప్తాను గతేడాది చెక్‌ రిపబ్లిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం(జూన్‌ 17)న అతడిని అమెరికా ఫెడరల్‌ కోర్టులో ప్రవేశపెట్టి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించినట్లు సమాచారం.

బ్రూక్లిన్‌ నిర్భందంలో..
నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అమెరికాకు అప్పగించడంతో ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ఫెడర్‌ మెట్రో పాలిటన్‌ నిర్భందంలో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అయితే కోర్టు విచారణ కోసం ఆయను అమెరికా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడికి చేరుకున్న ఒక రోజు వ్యవధిలోనే నిఖిల్‌ను కోర్టులో ప్రవేశపెట్టి విచారణ చేస్తారని సమాచారం. 2023 జూన్‌ 30న చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో నిఖిల్‌ గుప్తాను అరెస్ట్‌ చేశారు.

ఇప్పటికే అభియోగాలు..
ఇదిలా ఉండగా, నిఖిల్‌ గుప్తాపై అమెరికా పోలీసులు అభియోగాలు మోపారు. పన్నూ హత్యకు నిఖిల్‌ ఓ వ్యక్తికి 15 వేల అమెరికన్‌ డాలర్లు ఇచ్చినట్లు పేర్కొంది. పన్నూ హత్య కుట్రలో ఓ భారతీయ ప్రభుత్వ అధికారి ప్రమేయం కూడా ఉందని ఆరోపించింది. అయితే ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు.

అమెరికాతో చర్చించే అవకాశం..
యూఎస్‌ జాతీయ భద్రతా సలహాదారుడు జేక్‌ సుల్లివన్‌ వార్షిక ఐసీఈటీ చర్చల్లో ఢిల్లీ పర్యటనకు రానున్న ఒక రోజు ముందు నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై జాతీయ భద్రతా సలహాదారు అజిద్‌ దోవల్‌ జేక్‌ సుల్లివన్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పన్నూ హత్య కుట్ర వెనుక భారతీయుల ప్రమేయం ఉందన్న అమెరికా ఆరోపణలను ఇండియా మీడియా ఖండించింది. ఇదిలా ఉండగా నిఖిల్‌ గుప్తాపై అభియోగాలను అతని తరఫు న్యాయవాది రోహిణి తోసిపుచ్చారు. పన్నూ హత్యకు కుట్ర చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని భారత సుప్రీం కోర్టుకు ఆమె లేఖ రాశారు. చెక్‌ రిపబ్లిక్‌ న్యాయవాదిపై అమెరికా ప్రభావం ఉందని లేఖలో పేర్కొన్నారు.