ప్రవాస భారతీయులుUS Student Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూ తేదీలు...

US Student Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూ తేదీలు ఇవే!

US Student Visa: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఈనెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లను మంగళవారం(మే 7న) విడుదల చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

దశల వారీగా స్లాట్లు..
దశల వారీగా స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా రాయబార కార్యాలయం అధికారి తెలిపారు. జూన్‌ నెల స్లాట్లను ఈనెల మూఓ వారంలో, జూలై నెల జూన్‌లో ఆగస్టు నెలకు ఇంటర్వ్యూ తేదీలను విడుదల చేయనున్నట్లు వివరించారు. అమెరికాలో రెండు సెమిస్టర్ల విద్యా సంవత్సరానికి సబంధించి ఫాలల్‌ సీజన్‌ ఏటా ఆగస్టు–సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఈ సీజన్‌లో అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సమాయత్తం అవుతున్నారు.

ఆదివారాల్లోనూ..
వీసా ప్రక్రియలో భాగంగా తొలిముద్రల నమోదు, తర్వాత ప్రత్యక్ష ఇంటర్వ్యూ విధానాన్ని అమెరికా అమలు చేస్తుంది. అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అన్ని కానుసలేటు కార్యాలయాలకు శని ఆదివారాలు సెలవులు. అయితే రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శని, ఆదివారాలైన మే 19, 29 తేదీల్లోనూ స్లాట్లు కేటాయించారు.

అక్టోబర్‌లో టూరుస్టు వీసాలు..
విద్యార్థుల వీసాల ప్రక్రియ పూర్తయ్యాక.. టూరిస్టు వీసా(బీ1, బీ2) స్లాట్లు అదుబాటులోకి వస్తాయని సమాచారం. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ రెండో వారంలోగా విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌లో పర్యాటక వీసా స్లాట్లు జారీ అవుతాయని సమాచారం. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అంతకు ముందే పర్యాటక వీసాల ప్రక్రియ పూర్తి చేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

International Trip: అంతర్జాతీయ యాత్రకు వెళ్తే మీ వద్ద ఈ 5 పత్రాలు మస్ట్ గా ఉండాలి..

International Trip: అంతర్జాతీయ పర్యటనకు వెళ్లడం ఒక మంచి అనుభవం కదా. కానీ దానికి సరైన పత్రాలను కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ పత్రాలు లేకుండా ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుంది....

US Student Visa: ట్రంప్‌ కఠిన వీసా నిర్ణయం… విదేశీ విద్యార్థులకు షాక్‌

US Student Visa ట్రంప్‌ నిర్ణయం అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చింది. ట్రంప్‌ పరిపాలన గతంలోనూ వీసా విధానాలను కఠినతరం చేసినప్పటికీ, ఈ సారి చైనీస్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.

Most Popular

Kotha Jaipal Reddy : దుబాయ్‌లో ‘ఈటీసీఏ’ బోనాల జాతర.. ముఖ్య అతిథిగా మైత్రి గ్రూప్ అధినేత కొత్త...

దుబాయ్: తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో యూఏఈలో అత్యంత వైభవంగా నిర్వహించారు....

TANA : అమెరికాలో మారుతున్న జీవనశైలి మధ్య… పెద్దలకు ప్రత్యేక గౌరవం తెలిపిన తానా!

TANA : అమెరికాలో ఉద్యోగాలు, చదువులు, బిజీ జీవితాల మధ్య కుటుంబ బంధాలు క్రమంగా దూరమవుతున్నాయనే ఆందోళన తరచూ వినిపిస్తుంది. ముఖ్యంగా మనవలు, మనవరాళ్లతో తాతయ్యలు, నానమ్మలు లేదా అమ్మమ్మలు కలిసి గడిపే...

TANA New Jersey : ప్రకృతితో అడుగులు.. అనుబంధాలతో ప్రయాణం.. తానా న్యూజెర్సీ ‘హైకింగ్-26’కు విశేష స్పందన

TANA New Jersey : హిల్స్‌బరో టౌన్‌షిప్ (న్యూజెర్సీ): నగర జీవితపు హడావుడికి కాసేపు విరామం ఇచ్చి, పచ్చని ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు తానా (ఉత్తర అమెరికా...

TANA Father’s Day Walk : జూలై 2025 నుంచి వరుస కార్యక్రమాలు.. తానా మిడ్-అట్లాంటిక్ 40వ ఈవెంట్‌గా...

TANA Father's Day Walk : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ ప్రాంతం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల పరంపర విజయవంతంగా కొనసాగుతోంది. జూలై 2025 నుంచి నిరంతరాయంగా...

TANA – SATVIINSPIRE Foundation : తానా – SATVIINSPIRE ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనుగుపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు...

TANA - SATVIINSPIRE Foundation అనకాపల్లి: విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులు వారి విద్యా పురోగతిని సులభంగా పర్యవేక్షించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), SATVIINSPIRE ఫౌండేషన్ సంయుక్త...