Raita Mocherla: ఫిన్‌లాండ్‌కు చెందిన రైతా మోచర్లది మధ్య తరగతి కుటుంబం. స్కూల్‌లో ఇతర భాషలు నేర్చుకునే అవకాశం ఉండడంతో ఇంగ్లిష్, స్వీడిష్, జర్మన్, రష్యన్ నేర్చుకుంది. ఇంగ్లిష్‌పై పటుట కోసం యాహూ చాటింగ్‌లోకి వెళ్లింది. 1997లో యాహూలో ప్రదీప్ పరిచయమయ్యాడు. చాట్‌లో తన మాతృభాష తెలుగు అని చెప్పాడు. తొలిసారి తెలుగు భాష గురించి విన్న రైతా తానూ నేర్చుకోవాలనుకుంది. ఈ విషయాన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు చెప్పగా ఆయన 1960లో తాను ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒకాయన ఫిన్‌లాండ్‌లో తెలుగు సబ్జెక్టు కోర్సు చెప్పారని తెలిపారు. దీనికి సంబంధించి రెండు పుస్తకాఉల తెచ్చి ఇచా4్చడు. అలా తెలుగు నేర్చుకుంది రైతా.
పరిచయం ప్రేమగా..
ప్రదీప్‌తో పరిచయం నాలుగేళ్లలో ప్రేమగా మారింది. అప్పటి వరకు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. ఇద్దరూ చదువుకున్నారు. ఓసారి ప్రదీప్ ఫిన్‌లాండ్‌కు వెళ్లాలనుకున్నాడు. అయితే వీసా రాలేదు. తర్వాత రైతా ఇండియాకు రావడానికి యత్నించగా ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ తర్వాత ప్రదీప్ మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్లాడు. రైతా ప్రదీప్ కోసం లండన్ వెళ్లింది. ఇద్దరూ గుర్తు పట్టుకోవడానికి ప్రదీప్ గతంలో పంపిన పసుపురంగు సల్వార్‌కమీజ్ ధరించి వెళ్లింది. దానిని చూసి ప్రదీప్ గుర్తు పట్టాడు. ఇలా మొదటిసారి కలుసుకున్నారు. ఇప్పటికీ ఆ దుస్తులు రైతా భద్రంగా ఉంచుకుంది.
లండన్‌లో పెళ్లి..
ఇక లండన్‌లోఉన్న ప్రదీప్, రైతా అక్కడే పెళ్లి చేసుకున్నారు. 2005లో ఫిన్‌లాండ్, ఇండియాలో ఆయా సంప్రదాయాల ప్రకారం మరోరెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి సంప్రదాయాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ వచ్చింది. ఇక్కడి సంస్కృతి అందరూ రైతాపై చూపిన ప్రేమ, మర్యాదలు నచ్చింది. మెచ్చింది. క్రమంగా తెలుగు, ఇంగ్లిష్, హిందీలో నైపుణ్యం పెంచుకుంది. వీరికి నలుగురు పిల్లలు.
పర్యావరణ హిత ప్రాజెక్టు..
ఇక రైతా మేడ్‌చల్‌లో సిమెంటు, ఇనుముతో కాకుండా రాళ్లు, మట్టితో పర్యావరణహితంగా ఇంటిని నిర్మించుకున్నారు. ఆరు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాం చేసి హైదరాబాద్ వాసులకు కూరగాయలు, ఆకు కూరలు పదేళ్లు పంపిణీ చేశారు. తర్వాత మరుగుదొడ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలను పునర్వినియోగించేలా సూయిజ్ ట్రీట్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్టు చేపట్టారు. పలు పరిశోధనల తర్వాత తోటలో ఆక్వాట్రాన్ని ఇన్‌స్టాల్ చేసి సక్సెస్ అయ్యారు. బయో కంపోస్టింగ్ టాయిలెట్ విధానంతో వృథా నీటిని సేకరించి తోట, వ్యవసాయం, రీఫ్లషింగ్ వంటివాటికి వినియోగిస్తున్నారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ భారత్ హ్యాకథాన్–2017 పోటీలో వీరి ప్రాజెక్టు విజేతగా నిలిచింది. రూ.3 లక్షల నగుదు బహుమతి అందుకుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రాతోపాటు దేశవ్యాప్తంగా అపోలో, సన్‌పార్మా వంటి పలు ప్రైవేటు సంస్థలతోపాటు లద్దాఫ్లోని ఇండియన్ ఆర్మీకి ప్రాజెక్టును ఇన్‌స్టాల్ చేశారు. దీనిని ప్రపంచ వ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో 30 మందికిపైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ప్రత్యేక పార్కు..
రైతా–ప్రదీప్ దంపతులు త్వరలో ఇండియన్ మైథాలజీ థీమ్‌తో ఒక ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఇది పిల్లలతోపాటు అన్ని వయసుల వారికీ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుతుందని చెబుతున్నారు.