Dr. Uma .R. Katiki (Aramandla) : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2025-2027 ఎన్‌ఆర్‌ఐ స్టూడెంట్ కోఆర్డినేటర్‌గా డా. ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా “ఈ గౌరవప్రదమైన పదవిని ఇచ్చినందుకు.. మిగిలిన సభ్యులు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. ఇది నా మూడవ వరుస పదవీకాలం కావడం గర్వంగా ఉంది” అని డా. ఉమా గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదివరకు డా. ఉమ గారు 2021-2023 సంవత్సరాలలో తానా వుమెన్ సర్వీస్ కోఆర్డినేటర్‌గా, అలాగే 2023-2025 కాలంలో తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్‌గా సేవలు అందించారు. తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా 200కు పైగా గృహహింస కేసుల్లో మహిళలకు అండగా నిలిచి మార్గదర్శకం డా. ఉమా గారు చేశారు. మహిళల సాధికారత కోసం, పలు సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొని విశేషంగా కృషి చేశారు.
ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐ విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ.. తానా లక్ష్యాలను ముందుంచుకుని, విద్యార్థుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు తాను పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని ఆమె తెలిపారు.
తానాలో సేవ చేయడానికి మరోసారి ఈ అవకాశం లభించినందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాలకు: www.uma4tana.com
-డా. ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) గారి బయోడేటా..
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించి అమెరికాకు ఏగి అంచలంచెలుగా ఎదిగి.. ఎన్నో సేవా కార్యక్రమాలతో గొప్ప సంఘసంస్కర్తగా ఉమా గారు పేరుతెచ్చుకున్నారు. ఉమా గారు ఆంధ్ర యూనివర్సిటీలో పీ.హెచ్.డీ పట్టా అందుకున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి క్లినికల్ ట్రయల్స్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ పొందారు.. అంత ఉన్నత చదువులు చదివిన ఉమా గారు తల్లిదండ్రులు నేర్పిన సేవను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా సమాజంలోని మహిళల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 2021లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్’గా ఎన్నికై ఎంతో మందికి సేవ చేశారు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తన సేవా తత్పరతను నిరూపించుకున్నారు.
-ఉమా గారి సేవా కార్యక్రమాలు..
తానా సేవా కార్యక్రమాల్లో డా. ఉమా గారు ఆర్థిక స్వావలంబన సదస్సులు, ఆరోగ్య సదస్సులు.. అన్నదానం, యోగా సెషన్స్, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, మహిళా త్రోబాల్ టోర్నమెంట్, ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాలు, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ కార్యక్రమాలు, క్యాన్సర్ అవగాహన సదస్సులు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.. తానాలో మహిళా అభ్యున్నతి కోసం సేవలో నేను సైతం అంటూ ఉమా గారు అందరికంటే ముందున్నారు.బయటకు చెప్పుకోలేని.. గృహహింసతో బాధపడుతున్న ఎంతో మంది మహిళలకు తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా డా. ఉమా గారు అండగా నిలిచారు. ప్రతీవారం 2 నుంచి 3 వరకూ పరిష్కరిస్తూ డా. ఉమా గారు మహిళల కోసం ముందుండి నడిచారు.
గత మూడు నాలుగేళ్లుగా పలువురిని కూడగట్టుకొని మరీ అవగాహన కల్పిస్తూ తానా తరుఫున ఎన్నో సేవా కార్యక్రమాలను డా. ఉమా గారు నిర్వహించారు. అంతకుముందు APNRT కోఆర్డిన్టేటర్ గా.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శిగా మరియు చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలను ఉమాగారు నిర్వహించారు.
తాజాగా ఎన్‌ఆర్‌ఐ స్టూడెంట్ కోఆర్డినేటర్‌గా డా. ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) ఎంపిక పట్ల తానా సభ్యులు, ఎన్నారైలు , అమెరికాలోని ప్రవాస మహిళలు, తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమాగారు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.