TANA: తానా బోర్డు చైర్మన్‌గా డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌.. ఏకగ్రీవంగా ఎన్నిక

తానా చైర్మన్‌గా ఎన్నికైన నాగేంద్ర శ్రీనివాస కొడాలి ప్రపంచ ప్రతిష్టాత్మక టెక్సాస్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో పీడియాట్రిక్స్‌ కార్డియో వాస్కులర్‌ అనస్థీషియా విభాగంలో సేవలు అందిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 8, 2024 10:27 am

TANA

Follow us on

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో ప్రతిష్టాత్మక బోర్డు చైర్మన్‌ పదవికి డాక్టర్‌ నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకవ్రంగా ఎన్నికయ్యారు. బుధవారం(మార్చి 6న) రాత్రి జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్‌తోపాటు కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా లక్ష్మి దేవినేతి, కోశాధికారిగా జనార్దన్‌ నిమ్మలపూడి(జానీ) ఎన్నికయ్యారు.

డాక్టర్‌గా నాగేంద్ర శ్రీనివాస్‌ సేవలు..
తానా చైర్మన్‌గా ఎన్నికైన నాగేంద్ర శ్రీనివాస కొడాలి ప్రపంచ ప్రతిష్టాత్మక టెక్సాస్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో పీడియాట్రిక్స్‌ కార్డియో వాస్కులర్‌ అనస్థీషియా విభాగంలో సేవలు అందిస్తున్నారు. బేలర్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌లో ఫ్యాకల్టీగా వైద్య విద్యను బోధిస్తన్నారు. నాగేంద్ర శ్రీనివాస్‌ గతంలో తానా బోర్డు కార్యదర్శిగా పనిచేశారు.

బసవతారకం ప్రాజెక్టు సేవలు..
తానా – బసవతారకం ప్రాజెక్టుకి నాగేంద్ర శ్రీనివాస్‌ ముందుండి సేవలు అందించారు. బసవతారకం క్యాన్సర్‌ ఇన్సి్టట్యూటికి తానా ఫౌండేషన్‌ తరపున రూ.కోటి నిధిని సమకూర్చి వైద్య పరికరాలు అందించడంలో కీలకపాత్ర పోషించారు. సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా వేద పాఠశాలలు, గోశాలలు, గురుకులాలు, దేవాలయాల అభివృద్ధికి ఆర్ధిక వనరులు సమకూర్చడంతో పాటు సేవలందిస్తున్నారు.

లక్ష్మి దేవినేని..
తానా బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మి దేవినేని గతంలో తానా బోర్డు కోశాధికారిగా, న్యూజెర్సీ రీజినల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. 23వ తానా మహాసభలకు పలు కమిటీల్లో సేవలందించారు. ఆమె పనితీరు, చొరవ ఆధారంగానే కమిటీ ఏకగ్రీవంగా కార్యదర్శిగా ఎన్నిక చేసింది.

జనార్దన్‌ నిమ్మలపూడి..
ఇక తానా కమిటీ కోశాధికారిగా నియమితులైన జనార్దన్‌ నిమ్మలపూడి కూడా గతంలో తానా 21వ మహాసభ కార్యదర్శిగా, క్యాపిటల్‌ రీజియన్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. క్యాన్సర్‌ అవగాహన, నిధుల సమీకరణకు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్క్‌ రూ.కోటి నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు.

ముగ్గురూ ముగ్గురే..
తానా నూతన కమిటీ చైర్మన్‌గా, కార్యదర్శి, కోశాధికారిగా ఎన్నికైనా నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి, లక్ష్మి దేవినేని, జనార్దన్‌ నిమ్మలపూడి ముగ్గురూ సమర్థులే అని తానా సభ్యులు పేర్కొంటున్నారు. వీరి సారథ్యంలో తానా మరిన్ని లక్ష్యాలను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూతన కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.