Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు చాలా సంవత్సరాల పాటు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అయితే ఏర్పాటు చేసుకొని స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందుతున్నారు. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న నటిమని సమంత… ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ తర్వాత స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని విబేధాల కారణంగా ఇద్దరూ డివోర్స్ తీసుకొని విడివిడిగా ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి సమంత సినిమాల పరంగా తన హవాను తగ్గించిందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ప్రముఖ ఫెమినా పత్రిక మార్చ్ ఎడిషన్ కోసం సమంత హాట్ పిక్స్ ని కవర్ ఫోటోలుగా వాడుకున్నారు. ఇక ఈ పిక్ లో సమంత గైపూర్ లెస్ కార్పెట్ మరియు ప్యాంట్ ధరించింది…
ఇక మరో పిక్ లో గోల్డ్ స్లీవ్ లెస్ టాప్ ను వేసుకొని జుట్టును ఫ్రీ గా వదిలేసింది. దీని వల్ల సమంత తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని తన అభిమానులకు తెలియజేసే ఫోటో అనే చెప్పాలి…ఇలా తను చాలా హాట్ లుక్స్ తో కవర్ పేజీ కి ఫోజులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో చాలా వైరల్ గా మారుతున్నాయి…
ఇక గత కొద్దీ రోజుల నుంచి పెద్ద సినిమాలు ఏమి చేయకుండా సమంత ఖాళీ గానే ఉంటుంది. కాబట్టి తను ఇప్పుడు మరికొన్ని పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు కూడా ఉన్నాయి…
చూడాలి మరి ఇక మీదట సమంత వరుసగా పెద్ద సినిమాలు చేస్తుందా లేదా అనేది…ఇక తను నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పెద్ద సినిమాల్లో నటించలేదు…