Women’s Day 2024: అంతర్జాతీయ మహిళా దిన్వోసవం (మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంంలో శనివారం(మార్చి 2న) లేడీస్ నైట్ అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా భారతీయ సంతతికి చెందిన న్యాయమూర్తి జస్టిస్ శాలినా కుమార్ హాజరై మాట్లాడారు. అమెరికాలోపాటు ప్రపంచలోని పలు దేశాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో భారతీయ మహిళలు అందిస్తున్న సేవలు, కనబరుస్తున్న ప్రతిభ పాటవాలను కొనియాడారు. మహిళలు అన్నిరంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు.
వెలకట్టలేని సేవలు..
ముఖ్య వక్తగా హాజరైన ఆచార్య పద్మజ నందిగామ మాట్లాడుతూ మహిళలు కుటుంబం కోసం రోజూ నిర్వహించే సేవలు వెలకట్టలేనివి అన్నారు. కార్యక్రమ నిర్వమణ కమిటీ సభ్యులు సుష్మ పదుకొనే సుమ కల్వల మాట్లాడుతూ అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ సంంఘం వనితా బృందాలు రాబోయే రోజుల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలు మరింత ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నిర్వాహకులకు సత్కారం..
ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కమిటీ సభ్యులు సుష్మ పదుకొనె, స్వప్ప చింతపల్లి, సుమ కల్వల, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డి, హర్షిణి బీరపు, అర్పిత భూమిరెడ్డి, కల్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకుల వరం తదితరులను జీటీఏ డెట్రాయిట్ కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. డెట్రాయిట్‌లో వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన జీటీఏ చైర్మన్ విశ్వేశ్వర్‌రెడ్డి కలువల, అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి కేసిరెడ్డి, జీటీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆఫ్ ట్రస్టీలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.
350 మంది అతిథులు..
ఇక ఈ కార్యక్రమంలో వివిధ భాషా సంస్కృతకులకు చెందిన 350 మంది భారతీయ మహిళలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్‌షోలో పాల్గొన్న మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. భారతీయ వంటకాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హాజరైన వారి నోరూ ఊరించాయి. ఇక శ్రీకాంత్ సందుగు పాటలతో ప్రేక్షకులను అలరించార. వ్యాఖ్యాత సాహితి వింజమూరి తనదైన శైలి మాటలతో ఆకట్టుకున్నారు.