Columbia : కొలంబియాలో కొలువుదీరిన దశావతార వేంకటేశ్వరుడు.. ప్రత్యేకతలివీ

Columbia దాదాపు 2 వేల మందికి విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం, స్వామివారి అక్షింతలు వలంటీర్ల సహాయంతో ఇళ్లకు వెళ్లి ఇచ్చి ఆహ్వానించినట్లు తెలిపారు.

Written By: NARESH, Updated On : June 19, 2024 10:20 pm

Dashavatara Venkateswara in Columbia..

Follow us on

Columbia : ఉత్తర అమెరికా సౌత్‌ కరోలినా రాష్ట్రంలోని కొలంబియా పట్టణంలో శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. జూన్‌ 14 నుంచి 16వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించారు. మొదటి రెండు రోజులు అంకురార్పణ, సంకల్పం, జలాధివాసం, భూమిపూజ, విష్ణు సహస్ర హోమం, శ్రీదశావతార హోమం, పుష్పాధివాసం వంటివి నిర్వహించారు. మూడో రోజున సుమారు ఆరు అడుగుల స్వామివారి దివ్య మంగళ విగ్రహం ఆలయంలో ప్రతిష్టించారు. అదేరోజు స్వామివారి కళ్యాణం, రథోత్సవం నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమం విద్యావన్‌ శ్రీధర శ్రీనివాస్‌ భట్టాచార్య, మధుగిరి రాఘవ శ్రీనివాస నారాయణ భట్టార్‌ల నాయకత్వంలో 11 మంది రుత్వికుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 70 మంది వలంటీర్లు నెల రోజులపాటు నిర్విరామంగా పనిచేసి దీనికి కావాల్సిన ఏర్పానట్లు సమకూర్చుకున్నారు.

తరలి వచ్చిన వందలాది భక్తులు..
మూడు రోజుల వేడుకల్లో ప్రతీ రోజు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎక్కడా ఎవరికీ అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన వి.మురళి నాయకత్వంలో ముగ్గురు విధ్వాంసులతో కూడిన నాదస్వర బృందం ఈ కార్యక్రమబం పొడుగునా తమ చర్కని సంగీతంతో స్వామివారిని, భక్తులను అలరించింది. అట్లాంటా నుంచి వచ్చిన రామకృష్ణ దంపతులు సంప్రదాయక, రుచికరమైన భోజనాలను భక్తులకు వండి పెట్టారు. చివరి రోజున రుత్వికులను, వలంటీర్లను ఉచిత రీతిని సత్కరించారు. బాల బాలికల కోసం నిర్వహించిన దశావతార క్విజ్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు.

అమెరికాలో మొదటి ఆలయం..
ధర్మకర్తల మండలి అధ్యక్షులు సత్యశ్రీనివాస దాస కడాలి మాట్లాడుతూ అమెరికాలో ఈ ఆలయం మొదటిది అని తెలిపారు. ప్రపంచంలో రెండోది అని పేర్కొన్నారు. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి, శ్రీవేంకటేశ్వర రూప అంశాలతో కూడిన దశావతార వేంకటేశ్వరస్వామి ఎంత వైవిధ్య భరితంగానో ఉంది అని వివరించారు. దాదాపు 2 వేల మందికి విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం, స్వామివారి అక్షింతలు వలంటీర్ల సహాయంతో ఇళ్లకు వెళ్లి ఇచ్చి ఆహ్వానించినట్లు తెలిపారు.