Anchor Rashmi : జబర్దస్త్ ఎందరికో జీవితాలు ఇచ్చింది. సామాన్యులను స్టార్స్ చేసింది. అనసూయ, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర… చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ షో ప్రారంభించారు. రోజా, నాగబాబు జడ్జెస్. అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. షోకి విపరీతమైన ఆదరణ వచ్చింది. జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేశారు. జబర్దస్త్ కి అనసూయ యాంకర్ కాగా, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ యాంకర్.
జబర్దస్త్ మొదలై దశాబ్దం దాటిపోయింది. స్టార్స్ అందరూ ఒక్కొక్కరిగా జబర్దస్త్ ని వీడిపోయారు. నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, అనసూయ లతో పాటు మరికొందరు స్టార్ కమెడియన్స్ ప్రస్తుతం జబర్దస్త్ లో లేరు. దాంతో జబర్దస్త్ కి వైభవం తగ్గుతూ వచ్చింది. చాలా వరకు కమెడియన్స్, టీమ్ లీడర్స్ కొత్తవాళ్లే. రాకెట్ రాఘవ, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్ వంటి కొందరు సీనియర్స్ మాత్రం కొనసాగుతున్నారు.
ఇటీవల జబర్దస్త్ లో కీలక మార్పులు చేశారు. ఎక్స్ట్రా జబర్దస్త్ తీసేసి జబర్దస్త్ మాత్రమే ఉంచారు. అలా అని ఒక వారానికి పరిమితం చేయలేదు. వారానికి రెండు ఎపిసోడ్స్ జబర్దస్త్ పేరిట ప్రసారం అవుతాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ తీసేయడంతో యాంకర్ గా ఉన్న రష్మీ గౌతమ్ సూసైడ్ అటెంప్ట్ చేసిందట. విషయం తాగబోయిందట. ఈ విషయాన్ని ఆటో రామ్ ప్రసాద్ బయటపెట్టాడు. దాంతో జబర్దస్త్ సెట్స్ లో ఉన్నవాళ్ళందరూ అవాక్కు అయ్యారు.
అయితే కామెడీలో భాగంగా రామ్ ప్రసాద్ ఈ కామెంట్ చేశాడు. ‘ఎక్స్ట్రా జబర్దస్త్ తీసేశారని విషయం తాగబోయిన రష్మీ… జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ కి నువ్వే యాంకర్ అని చెప్పడంతో, విషం పక్కన పెట్టి విస్కీ కొట్టింది” అని జోక్ వేశాడు. ఈ పంచ్ బాగా పేలింది. ఇక మల్లెమాలనే నమ్ముకున్న రష్మీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కొనసాగుతుంది. ఢీ నుండి ఆమె తప్పుకున్న సంగతి తెలిసిందే…